తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) చైర్మన్ గా ఐఏఎస్ అధికారి డా.బి.జనార్ధన్ రెడ్డిని ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించిన సంగతి తెలిసిందే. అలాగే రమావత్ ధన్ సింగ్, కారం రవీందర్ రెడ్డి, ఆర్.సత్యనారాయణ, ప్రొఫెసర్ బి.లింగారెడ్డి, కోట్ల అరుణ కుమారి, సుమిత్రా ఆనంద్ తనోబా, అరవెల్లి చంద్ర శేఖర్ రావులను సభ్యులుగా నియమించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం చైర్మన్ గా బి.జనార్దన్ రెడ్డితో పాటుగా ఏడుగురు సభ్యులు కూడా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారికీ సిబ్బంది సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో 50 వేల ఉద్యోగ నియామకాలకు కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా టీఎస్‌పీఎస్సీలో పూర్తిస్థాయిలో సభ్యులంతా బాధ్యతలు స్వీకరించడంతో రాష్ట్రంలో ఉద్యోగాల నియామక పక్రియ మరింత వేగవంతం కానుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ