తెలంగాణలో కొత్తగా 997 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు

Telangana Records 997 New Covid-19 Cases, and 4 Deaths on Nov 12

తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 997 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 12, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,55,663 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనాతో మరో నలుగురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1397 కి పెరిగింది. గురువారం నాడు 42163 శాంపిల్స్ పరీక్షించగా, రాష్ట్రంలో పరీక్షలు సంఖ్య 48,12,167 కు చేరుకుంది.

తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 169, మేడ్చల్ లో 85, రంగారెడ్డి జిల్లాలో 66, భద్రాద్రి కొత్తగూడెంలో 65, కరీంనగర్ లో 49, నల్గొండలో 46, ఖమ్మంలో 44, వరంగల్‌ అర్బన్‌ లో 44, సూర్యాపేటలో 30, నాగర్ కర్నూల్ లో 25 నమోదయ్యాయి.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (నవంబర్ 12, రాత్రి 8 గంటల వరకు) :

  • రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు: 48,12,167
  • రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 2,55,663
  • కొత్తగా నమోదైన కేసులు : 997
  • నమోదైన మరణాలు : 4
  • రికవరీ అయిన వారి సంఖ్య : 2,37,172
  • కరోనా రికవరీ రేటు: 92.76%
  • యాక్టీవ్ కేసులు: 17,094
  • హోమ్/ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్‌లో ఉన్నవారి సంఖ్య: 14,466
  • మొత్తం మరణాల సంఖ్య : 1397
  • కరోనా మరణాల రేటు: 0.54%

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ