తెలంగాణాలో జనవరి నెలలో కరోనా కేసులు పెరిగే అవకాశం

Covid B.1.1.529 variant, covid-19 new variant, Covid-19 Variant Omicron Cases, Covid-19 Variant Omicron Cases In Telangana, Mango News, Mango News Telugu, New coronavirus Strain, New Covid 19 Variant, New Covid Strain Omicron, Omicron, Omicron covid variant, Omicron variant, omicron variant in India, omicron variant south africa, Telangana Covid-19 Variant Omicron, Telangana Covid-19 Variant Omicron Cases, Telangana Covid-19 Variant Omicron Cases Could Surge, Telangana Covid-19 Variant Omicron Cases Could Surge From Mid-January, Telangana Covid-19 Variant Omicron Cases Could Surge From Mid-January and Peak in February, Update on Omicron

తెలంగాణా రాష్ట్రంలో జనవరి నెలలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని, వచ్చే 6 వారాలు చాలా కీలకమని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాసరావు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తున్న ఈ సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఒమిక్రాన్ వేరియెంట్ మన రాష్ట్రంలో కూడా ఇప్పుడిప్పుడే ప్రభావం చూపిస్తున్నది. జనవరిలో ఇది ఇంకా పెరిగే అవకాశం ఉన్నదని చెప్పారు. జనవరి 15 తరవాత కరోనా కేసులు బాగా పెరిగే అవకాశం ఉందని, ఇది క్రమంగా పెరుగుతూ ఫిబ్రవరి నాటికి కరోనా దాల్చే అవకాశం ఉందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో లాక్ డౌన్ లాంటి నిర్ణయాలు ఉండవని అయన స్పష్టం చేసారు.

కావున ప్రజలందరూ వచ్చే 6 వారాలు చాలా కీలకమని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని శ్రీనివాసరావు సూచించారు. కాగా, ఒమిక్రాన్ వేరియెంట్ వెలుగు చూసిన వ్యక్తులలో లక్షణాలు స్వల్పంగా ఉండటం కొద్దిగా ఊరటనిచ్చే అంశమని ఆయన తెలిపారు. తీవ్ర ఒళ్ళు నొప్పులు, తలా నొప్పి, నీరసం వంటి స్వల్ప లక్షణాలే ఉంటున్నట్లు తెలిపారు. అయినా సరే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఒమిక్రాన్ వేరియెంట్ ఇప్పటికే చాలా దేశాలకు విస్తరించిందని గుర్తుచేశారు. ప్రజలందరూ తప్పనిసరిగా వాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three − 1 =