తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నాడు 52,057 శాంపిల్స్ పరీక్షించగా, 536 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,79,135 కి చేరింది. అలాగే కరోనాతో మరో ముగ్గురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1502 కి పెరిగింది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 107, మేడ్చల్-మల్కాజ్ గిరిలో 43, రంగారెడ్డిలో 41, వరంగల్ అర్బన్ లో 27, ఖమ్మంలో 26, భద్రాద్రి కొత్తగూడెంలో 26 నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (డిసెంబర్ 15, రాత్రి 8 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు: 62,57,745
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 2,79,135
- కొత్తగా నమోదైన కేసులు : 536
- నమోదైన మరణాలు : 3
- రికవరీ అయిన వారి సంఖ్య : 2,70,450
- కరోనా రికవరీ రేటు: 96.88%
- యాక్టీవ్ కేసులు: 7,183
- హోమ్/ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్‌లో ఉన్నవారి సంఖ్య: 5,041
- నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 1502
- కరోనా మరణాల రేటు: 0.53%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ