తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 540 పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 18, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,10,318 కి పెరిగింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే 263 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3 జిల్లాలో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. ఇక సోమవారం నాడు 25,585 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 708 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి మొత్తం సంఖ్య 8,01,726 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,481 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (540):
- హైదరాబాద్ – 263
- రంగారెడ్డి – 50
- మేడ్చల్ మల్కాజిగిరి – 34
- కరీంనగర్ – 23
- ఖమ్మం – 22
- నల్గొండ – 15
- యాదాద్రి భువనగిరి – 10
- పెద్దపల్లి – 10
- ఆదిలాబాద్ – 9
- వికారాబాద్ – 9
- మహబూబ్ నగర్ – 9
- మంచిర్యాల – 9
- మెదక్ – 9
- సంగారెడ్డి – 8
- నిజామాబాద్ – 6
- హనుమకొండ – 6
- వరంగల్ రూరల్ – 6
- కామారెడ్డి – 6
- జనగామ – 5
- రాజన్న సిరిసిల్ల – 5
- సిద్దిపేట – 4
- జోగులాంబ గద్వాల్ – 4
- జగిత్యాల – 4
- భద్రాద్రి కొత్తగూడెం – 3
- మహబూబాబాద్ – 3
- ములుగు – 3
- వనపర్తి – 2
- నాగర్ కర్నూల్ – 1
- జయశంకర్ భూపాలపల్లి – 1
- సూర్యాపేట – 1
- కొమరం భీం ఆసిఫాబాద్ – 0
- నారాయణ్ పేట్ – 0
- నిర్మల్ – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY