ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్‌టీసీ శుభవార్త చెప్పింది. మహాలక్ష్మీ పథకం కింద తెలంగాణ వ్యాప్తంగా ఆధార్ కార్డ్ ఉన్న ప్రతీ మహిళకు ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న తెలంగాణ ఆర్టీసీ..ఇప్పుడు మరో అదిరిపోయే వార్త వినిపించింది. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల్లో భాగంగా హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారమే అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు.
ఇప్పుడు తెలంగాణలో మరింతమంది ఆర్టీసీ ప్రయాణికులకు కూడా టీజీఎస్‌ఆర్టీస్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణ ఛార్జీలో ఏకంగా 10 శాతం రాయితీ ప్రకటించింది. అయితే ఇది అన్ని రూట్లలో వర్తించదని.. తెలంగాణ నుంచి బెంగళూరుకు ప్రయాణించే వారికి మాత్రమే టిక్కెట్ ధరలో పది శాతం రాయితీని కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
బెంగళూరు రూట్లో నడిచే అన్ని సర్వీసుల్లోనూ రానుపోనూ ఈ రాయితీ వర్తించనుందని అధికారులు తెలిపారు. ఈ రాయితీ వల్ల ఒక్కొక్కరికి 100 రూపాయల నుంచి 160 రూపాయల వరకూ ఆదా అవుతుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ రూట్ లో టికెట్ల ముందస్తు రిజర్వేషన్ కోసం http://tgsrtcbus.in అనే వెబ్ సైట్‌ని సంప్రదించాల్సిందిగా అధికారులు సూచించారు.
తెలంగాణ నుంచి చాలా మంది రెగ్యులర్ గా బెంగళూరు సిటీకి వెళ్తుంటారు. వ్యాపార పనులపై, అలాగే ఉద్యోగ రీత్యా అక్కడ పనిచేసే వారు కూడా రెగ్యులర్ గా బెంగళూరుకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇలాంటి వారికి ఇప్పుడు టీజీఎస్ ఆర్టీస్ ప్రకటించిన 10 శాతం రాయితీతో చాలా ఆదా అవుతుంది. అయితే.. ఒక్క బెంగళూరుకు వెళ్లే రూట్‌లోనే ఈ రాయితీని అమలు చేయడంతో..మిగిలిన ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల నుంచి విమర్శలు రావొచ్చన్న వాదన వినిపిస్తోంది.
తెలంగాణ నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త!!
బెంగళూరు మార్గంలో టికెట్ ధరలో 10 శాతం రాయితీని #TGSRTC యాజమాన్యం కల్పిస్తోంది.
బెంగళూరు రూట్ లో నడిచే అన్ని సర్వీసుల్లోనూ రానుపోనూ ఈ రాయితీ వర్తిస్తుంది.
ఈ రాయితీ వల్ల ఒక్కొక్కరికి రూ.100 నుంచి రూ.160 ఆదా అవుతుంది.
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 17, 2025