సీనియర్ సినీ జర్నలిస్టు, విమర్శకుడు గుడిపూడి శ్రీహరి కన్నుమూత, సంతాపం తెలిపిన పవన్ కళ్యాణ్

Senior Film Journalist Critic Gudipudi Srihari Passed Away Pawan Kalyan Expressed Condolences, Pawan Kalyan Expressed Condolences, Critic Gudipudi Srihari Passed Away, Senior Film Journalist And Critic Gudipudi Srihari Passed Away, Senior Film Journalist Gudipudi Srihari Passed Away, Gudipudi Srihari Passed Away, Senior Film Journalist, Critic, Janasena Chief Expressed Condolences, Gudipudi Srihari, Gudipudi Srihari News, Gudipudi Srihari Latest News, Gudipudi Srihari Latest Updates, Gudipudi Srihari Live Updates, Mango News, Mango News Telugu,

సీనియర్ సినీ జర్నలిస్టు, విమర్శకుడు గుడిపూడి శ్రీహరి(86) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. హిందూ, ఈనాడు సహా పలు దిన పత్రికల్లో గుడిపూడి శ్రీహరి పనిచేశారు. సితార ఫిల్మ్ మ్యాగజైన్‌ లో దశాబ్దాల పాటుగా ఆయన సినిమా రివ్యూలు రాశారు. 55 ఏళ్ల పాటుగా సినీ విశ్లేషకుడుగా, జర్నలిస్టుగా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. సినీ, ప్రేక్షక వర్గాల్లో అత్యంత ప్రభావవంతమైన సినీ విమర్శకుడుగా గుడిపూడి శ్రీహరి ప్రత్యేక గుర్తింపు పొందారు. గుడిపూడి శ్రీహరి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం తెలిపారు.

గుడిపూడి శ్రీహరి ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

పాత్రికేయ రంగంలో, ప్రత్యేకించి సినిమా జర్నలిజంలో విశేష అనుభవం కలిగిన గుడిపూడి శ్రీహరి కన్నుమూశారని తెలిసి చింతించానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “తెలుగు, ఆంగ్ల పత్రికల్లో సినీ విమర్శకుడిగా శ్రీహరి రాసిన వ్యాసాలు, సినిమా రివ్యూలు ఎంతో ఆసక్తిని రేకెత్తించేవి. తెలుగు చిత్రసీమ ప్రస్థానంలోని అనేక ముఖ్య ఘట్టాలను ఆయన అక్షరబద్ధం చేశారు. సినిమాతోపాటు వర్తమాన రాజకీయ, సామాజిక పరిణామాలపై ‘హరివిల్లు’ శీర్షికతో చేసిన వ్యంగ్య రచనలు ఆయన నిశిత పరిశీలన తెలిపివి. గుడిపూడి శ్రీహరి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =