తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 6న ప్రారంభమైన సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటుగా (సెప్టెంబర్ 6, 12, 13 తేదీల్లో) సమావేశాలు జరగగా, నేడు సభలో చర్చలు అనంతరం శాసనసభను నిరవధిక వాయిదా వేస్తునట్టుగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ సమావేశాల్లో భాగంగా తొలిరోజున (సెప్టెంబర్ 6) ఇటీవల మరణించిన తుంగతుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం, కమలాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పరిపాటి జనార్దన్‌రెడ్డికి సభ సంతాపం ప్రకటించింది. సంతాప తీర్మానాల అనంతరం సభ సోమవారానికి వాయిదా వేశారు. ఇక సోమవారం, మంగళవారాల్లో సభలో పలు కీలక బిల్లులను రాష్ట్ర మంత్రులు ప్రవేశపెట్టారు.
జీఎస్టీ చట్ట సవరణ బిల్లు, జీహెచ్‌ఎంసీ, తెలంగాణ పురపాలక చట్ట సవరణ, తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లు, ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, తెలంగాణ మోటార్ వెహికల్ టాక్సేషన్ సవరణ బిల్లు, ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా (టర్మినేషన్ అండ్ ల్యాండ్ రెగ్యులేషన్ అఫ్ లిజ్) బిల్లు, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ అండ్ సూపర్ న్యూఎషన్) సవరణ బిల్లు మరియు ఫారెస్ట్రీ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ బిల్లులపై చర్చించి, ఈ ఎనిమిది బిల్లులకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అనంతరం విభజన చట్టం హామీల అమలులో కేంద్రం వైఫల్యం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర వైఖరి, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సహా ఇతర అంశాలపై సభలో స్వల్పకాలిక చర్చ జరగగా, పలువురు మంత్రులు వివరణాత్మక ప్రసంగం చేశారు. అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తూ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలు పాటిస్తూ సభ నిర్వహణకు సహకరించినందుకు సభ్యులకు స్పీకర్ ధన్యవాదాలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY