ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే?

AP Govt Declares Dussehra Holidays For All The Schools From Sep 26 To Oct 6th, Dussehra Holidays, AP Govt Declares Dussehra Holidays, Dussehra School Holidays, Dussehra Holidays From Sep 26 To Oct 6th, Mango News, Mango News Telugu, Dussehra Celebration, AP Dussehra Celebration, AP Govt Dussehra Holidays Declaration, AP Dussehra Holidays, Dussehra Holidays For Schools, Andhra Pradesh Government, AP Govt Latest News And Updates

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు మొత్తం 11 రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఇది వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని సాధారణ పాఠశాలలకు దసరా సెలవులు సెప్టెంబర్ 26న ప్రారంభమవుతాయని, అయితే క్రిస్టియన్ మరియు మైనారిటీ పాఠశాలలు మాత్రం అక్టోబర్ 1వ తేదీ నుంచి సెలవులు మొదలవుతాయని వెల్లడించింది. కానీ అన్ని పాఠశాలలకు 6వ తేదీ వరకు మాత్రమే సెలవులు ఉంటాయని, 7వ తేదీ నుంచి యథావిధిగా పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయని స్పష్టం చేసింది.

కాగా ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు పనిదినాలు 220 రోజులుగా, అలాగే సెలవు దినాలు 80 రోజులు ఉంటాయని ఏపీ రాష్ట్ర విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ (2022-23)లో పేర్కొంది. దీని ప్రకారమే తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక విజయదశమి సందర్భంగా దుర్గాదేవికి తొమ్మిది రోజుల పాటు జరుగనున్న నవరాత్రి వేడుకలను దృష్టిలో పెట్టుకుని యేటా ఉభయ తెలుగు రాష్ట్రాలు కొన్ని రోజుల పాటు సెలవులను ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం సెలవులపై మంగళవారం నిర్ణయం ప్రకటించగా, మరోవైపు తెలంగాణలోని పాఠశాలలకు దసరా సెలవులను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 2 =