తెలంగాణ రాష్ట్ర రవాణా రంగాన్ని సమూలంగా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కీలక నిర్ణయాలు తీసుకోబడుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వ నూతన విధానాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ క్రమంలో, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఐటీసీ కాకతీయ హోటల్ లో జరిగిన కార్యక్రమంలో ఈటో మోటార్స్ నుండి ఫ్లిక్స్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు.
తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్‌ను 2026 డిసెంబర్ 31 వరకు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విధానం ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు, ప్రజలకు సురక్షితమైన & ఆర్థికంగా ప్రయోజనకరమైన రవాణా సదుపాయాలు అందించనుంది.
హైదరాబాద్‌లో అన్ని ఆర్టీసీ బస్సులు ఎలక్ట్రిక్‌గా మారనున్నాయా? ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ ఈటో మోటార్స్ ద్వారా మొదటి ఫ్లిక్స్ ఎలక్ట్రిక్ బస్సు ప్రారంభం!
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఈవీ వాహనాల ప్రమాణాలను పాటించాల్సిన అవసరం, రవాణా రంగంలో బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉండడం గురించి వివరించారు. బీసీ సంఘాలకు మరింత సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమని ప్రకటించారు.
ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల ద్వారా ట్రాఫిక్ సమస్యలతో పాటు కాలుష్యాన్ని కూడా గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపితే, ఆరోగ్యకరమైన & ఖర్చు తక్కువ ప్రయాణానికి మార్గం సుగమం అవుతుంది.