
టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి జూన్ 21 నాటికి మూడేళ్లు పూర్తవుతాయి. కేవలం ఐదుగురు శాసనసభ్యులున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ అధికారంలోకి తీసుకురావడంతో.. ఏఐసీసీ దగ్గర రేవంత్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే పార్టీ బాధ్యతలను మరొకరికి అప్పజెప్పడం ఇప్పుడు తప్పనిసరిగా మారడంతో రేవంత్ సూచించిన వ్యక్తికి టీపీసీపీ పదవిని అప్పగించే యోచనలో ఏఐసీసీ ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ హైకమాండ్ టీపీసీసీగా ఎవరిని నియమించినా తనకు సమ్మతమేనని, ఎవరిని నియమించాలన్నది ఏఐసీసీ అధ్యక్షుడికి సంబంధించిన అంశమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా స్పందించారు. అయితే..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డిలా యాక్టివ్‌గా పనిచేసే నేతకు ఈ అవకాశమివ్వడానికి ఏఐసీసీ చూస్తోంది.ఒకవైపు కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలంగా తయారు చేయడం, మరోవైపు పార్టీలోని భిన్నాభిప్రాయాలు ఉన్న నేతల నమ్మకాన్ని చూరగొనడం, సీనియర్లందరితో సఖ్యతగా మెలగడంతో పాటు, గ్రూపు రాజకీయాలను ఎప్పటికప్పుడు సమర్ధవంతంగా డీల్ చేయడం వంటి ఎన్నో అంశాలను దృష్టిలో పెట్టుకుని టీపీసీసీ చీఫ్ ఎంపికను చేయనుంది ఏఐసీసీ .
అయితే ప్రస్తుతం మంత్రిగా ఉన్న సీతక్కకు పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తారా అన్న వార్తలు జోరందుకున్నాయి. అదే కనుక జరిగితే ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్‌గా మహిళలు పని చేసినా కూడా తెలంగాణ రాష్ట్రానికి తొలి ఆదివాసీ మహిళగా సీతక్కకు ప్రత్యేక గుర్తింపు రానుంది. ఆమె పేరును రాష్ట్ర నేతలు ఏఐసీసీకి ప్రతిపాదించినా లేదా హైకమాండ్ ఖరారు చేసినా ఆదివాసీ మహిళగా ఉండటంతో ఆమెను వ్యతిరేకించడానికి పార్టీ లీడర్లు ఎవ్వరూ ముందుకు రారనే వాదన వినిపిస్తుంది.
ఇటు ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేశ్ కుమార్ గౌడ్ తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికైనా కూడా.. పీసీసీ చీఫ్ పోస్టును ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏఐసీసీ లీడర్లతో సన్నిహిత సంబంధాలు ఉన్న మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో పాటు సీనియర్ నేత జగ్గారెడ్డి,ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, పార్టీకి ఎప్పటి నుంచో విధేయుడిగా ఉన్న అద్దంకి దయాకర్ వంటి నేతలు కూడా ఈ పదవిపై ఆశలు పెంచుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి.. రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో..తో పీసీసీ చీఫ్‌గా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం ఉంటుందన్నటాక్ పార్టీలో వినిపిస్తోంది. అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా పీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్నారనే చర్చ నడుస్తోంది. టీపీసీసీ చీఫ్ నియామకం కన్నా ముఖ్యమైన అంశాలు ఉండటంతో.. ఇప్పటికిప్పుడు ఏఐసీసీ ఈ పదవికి అంత ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చనే వాదన కూడా వినిపిస్తున్నది. ఎలాగూ ఒకటి, రెండు నెలల్లో కేబినెట్ విస్తరణ ఉండడంతో ఒకేసారి పీసీసీ చీఫ్ మార్పు అంశాన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని ఏఐసీసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో టాక్ నడుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY