
ఆర్టీఓ వాహనదారులకు తాజాగా ఓ అలర్ట్ జారీ చేసింది.దీంతో జూన్ 1వ తేదీ నుంచి ఆర్టీఓ కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం అవి ఉల్లంఘించినవారికి భారీ ఎత్తున జరీమానా విధించే అవకాశం ఉంది.
రీజనల్ ట్రాన్స్‌ఫోర్ట్ ఆఫీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్టీవో.. జూన్ 1, 2024 నుంచి కొత్త వాహన నిబంధనలు అమలు చేయబోతుంది. కొత్త నిబంధనల ప్రకారం 18 ఏళ్లలోపు వారికి డ్రైవింగ్ ఇచ్చినా.. అతివేగంతో వాహనం నడిపినా.. రూ.25,000 జరిమానా విధించే అవకాశం ఉంది.
జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చే రూల్స్ ..వేగంగా వాహనం నడిపితే 1000 నుంచి 2000 రూపాయల వరకు జరీమానా చెల్లించాల్సి ఉంటుంది.అలాగే మైనర్ వాహనాన్ని నడిపితే రూ.25,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అలాగే లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే రూ.500 జరీమానా చెల్లించాల్సి ఉంటుంది.
ఎవరైనా బైక్ రైడర్స్ హెల్మెట్ ధరించకుండా డ్రైవ్ చేస్తే రూ.100, అలాగే కారులో సీటు బెల్ట్ పెట్టుకోకపోతే రూ.100 జరిమానా విధిస్తారు.అంతేకాదు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారయితే వారి లైసెన్స్ రద్దు చేయబడుతుంది. తిరిగి వారికి 25 ఏళ్లు వచ్చే వరకు లైసెన్స్ ఇవ్వరు
మరోవైపు డ్రైవింగ్ లైసెన్స్ మరింత సులభం చేసే నిబంధనలు కూడా ఆర్టీవో సడలించింది. జూన్ 1 నుంచి అమల్లోకి రాబోతున్న కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై లైసెన్స్ కావాలంటే ఆర్టీవో ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. స్లాట్ బుకింగ్, డ్రైవింగ్ టెస్ట్ వంటి ఎలాంటి టెస్ట్‌లు లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్ పొందొచ్చు.
కొత్త రూల్స్ ప్రకారం ఇకపై ప్రైవేట్ డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్‌లే డ్రైవింగ్ టెస్టులవీ నిర్వహించి సర్టిఫికెట్స్ జారీ చేస్తాయి.అయితే ప్రభుత్వంతో గుర్తింపు పొందిన డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్‌లకే ఆ పవర్ ఉంటుంది. అలాంటి డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్‌లలో డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకుంటే ..అవే డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి సర్టిఫికేట్స్ జారీ చేస్తాయి. దాని ఆధారంగా లైసెన్స్ కోసం అప్లై చేసుకుంటే చాలు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY