తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికలవేళ ఇచ్చిన రైతు రుణమాఫీ హామీని అమలు చేసింది. తొలి విడతలో భాగంగా రూ. 1 లక్ష లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ఈ మేరకు తొలి విడత రైతు రుణాల మాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు రైతుల అకౌంట్లలో రుణమాఫీ నిధులను జమ చేశారు. తొలి విడతలో భాగంగా 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాలో రూ. 7 వేల కోట్ల నిధులను జమ చేశారు. మూడు విడతల్లో భాగంగా మొత్తం రూ. 31 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.
ఈ నెలాఖరులోగా లక్షన్నర రుణాలను కూడా మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 2 లక్షల వరకు అప్పు ఉన్నవాళ్లకు మూడో విడతలో భాగంగా ఆగస్టు 15 లోపు మాఫీ చేస్తామని వెల్లడించింది. ఆగష్టు 15 వరకు రెండు లక్షల వరకు అప్పు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని తెలిపింది. రెండో విడత రుణమాఫీకి రూ. 8 వేల కోట్లు.. మూడో విడత రుణమాఫీకి రూ. 15 వేల కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా 110 రైతు వేదికల్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో.. రుణమాఫీ అయిన రైతులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం నుంచి మాట్లాడారు. ఇకపోతే రుణమాఫీ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులు సంబురాలు చేసుకుంటున్నారు. పలు చోట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF