
సింగరేణి బొగ్గు గనుల వేలంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల మధ్య ట్వీట్ వార్ పీక్స్‌కి చేరింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలతో పాటు ట్వీట్ల ఫైట్లూ కంటిన్యూ అవుతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు కేటీఆర్. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2021లో బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలంటూ, 4 బ్లాక్‌లను సింగరేణికి బదిలీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు ఉంచుకోవాలంటూ అప్పుడు రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు కేటీఆర్. అప్పుడేమో వేలాన్ని వ్యతిరేకించి, ఇప్పుడు సీఎం అయ్యాక మాత్రం వేలం పాట కోసం డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కను పంపించడం ఏంటంటూ సూటిగా ప్రశ్నించారు. మీలో వచ్చిన మార్పునకు గల కారణాలు చెప్పాలని కేటీఆర్ నిలదీశారు.
అయితే కేటీఆర్ ట్వీట్‌ను రేవంత్ రెడ్డి రీట్వీట్ చేస్తూ పాయింట్ టూ పాయింట్ రిప్లై ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. తెలంగాణ సంస్థల ప్రైవేటీకరణను, తెలంగాణ ప్రజల వాటాల అమ్మకానికి కేంద్రం పూనుకున్నా, కేసీఆర్ గవర్నమెంట్ ప్రయత్నించినా, కూడ కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు అడుగడుగునా వ్యతిరేకించారని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేంద్రం సింగరేణి గనులను తొలిసారి వేలం వేసిందని గుర్తు చేశారు.అంతేకాదు సింగరేణి గనులను అప్పుడే రెండు ప్రయివేట్ కంపెనీలయిన అరబిందో, అవంతికకు కట్టబెట్టిందని చెప్పారు. అప్పుడు బీఆర్‌ఎస్ పార్టీ ఎందుకు మాట్లాడలేదని కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు.
అలాగే సింగరేణి గనులను ప్రైవేటీకరించడం, వేలం వేయడాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అప్పుడే వ్యతిరేకించారని రేవంత్ రెడ్డి తెలిపారు. అవంతిక, అరబిందో ప్రయివేట్ కంపెనీలకు అప్పగించిన బొగ్గు బ్లాకులను రద్దు చేసి.. తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారని సీఎం చెప్పుకొచ్చారు. దీనికి నాడు భట్టి విక్రమార్క రాసిన లెటర్‌ను కూడా జత చేశారు. తెలంగాణ ప్రజల ఆస్తులను హక్కులను కాపాడేది కాంగ్రెస్ పార్టీ ఒకటేనని అన్నారు. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్‌తోనే సురక్షితమని.. మన బొగ్గు.. మన హక్కును కాపాడి తీరుతామంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్‌కు రిప్లై ఇచ్చారు తెలంగాణ సీఎం . మొత్తంగా అప్పటి ట్వీట్‌ను వెతికి కేటీఆర్ రీ ట్వీట్ చేస్తే..దానిని మళ్లీ రీట్వీట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY