మొదటి రెండురోజుల్లో 3.87 లక్షల మందికి కంటి పరీక్షలు, కంటి వెలుగుపై కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

Telangana CS Santhi Kumari held Video Conference on Kanti Velugu with District Collectors,Telangana CS Santhi Kumari,Santhi Kumari held Video Conference,Kanti Velugu with District Collectors,Mango News,Mango News Telugu,Kanti Velugu Programme,Kanti Velugu-2 Programme,Kanti Velugu Programme Telangana,Telangana Kanti Velugu Programme,Kanti Velugu Programme Latest News and Updates,Kanti Velugu News and Live Updates,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Minister KTR

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం అమలుపై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ శ్వేతా మొహంతిలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, రాష్ట్రంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ఇప్పటివరకు క్షేత్ర స్థాయి క్యాంప్ ల నిర్వహణ విజయవంతంగా జరుగుతుండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో మొదటి రెండు రోజుల్లో 3.87 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, అవసరమైన 97,335 మందికి కళ్ళద్దాల పంపిణీ చేసినట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లో వున్న బఫర్ టీమ్స్ ఉపయోగించి ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కోర్టు భవన సముదాయాలు, పోలీస్ బెటాలీయన్లు, జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్ ల వద్ద ప్రత్యేక కంటి వెలుగు క్యాంప్ లను నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ శాంతి కుమారి సూచించారు. కంటి అద్దాల నిల్వలను (స్టాక్స్) వివరాలను రోజు వారిగా సరిచూసుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యాంప్ ల నిర్వహణ చేపట్టాలని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =