తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్‌ కు పూర్తి అదనపు బాధ్యతలు

Senior IPS Officer Anjani Kumar Given Full Additional Charge as Telangana State DGP,Senior IPS Officer Anjani Kumar,Additional Charge as Telangana State DGP,Telangana State DGP Anjani Kumar,Mango News,Mango News Telugu,Anjani Kumar Ips Wikipedia,Anjani Kumar Ips Current Posting,Anjani Kumar Ips Birth Place,Hyderabad Police Commissioner Name List,Anjani Kumar Ips Contact Number,Anjani Kumar Ips Wife,Anjani Kumar Ips Family,Anjani Kumar Ips Office Address,Sri Anjani Kumar Ips,Anjani Kumar Ips Salary,Anjani Kumar Ips Son,Anjani Kumar Ips Age

తెలంగాణ రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్స్ జరిగాయి. తెలంగాణ రాష్ట్ర డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్‌ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్ర‌స్తుత డీజీపీ ఎం.మ‌హేంద‌ర్ రెడ్డి డిసెంబర్ 31న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ఏసీబీ డీజీగా విధులు నిర్వర్తిస్తున్న అంజ‌నీ కుమార్ ను తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కోఆర్డినేషన్), తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్) పదవీకి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్స్ వివరాలు

  • తెలంగాణ డీజీపీగా ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్‌ కు పూర్తి అదనపు బాధ్యతలు
  • ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా రవి గుప్తా నియామకం
  • హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా డా.జితేందర్
  • సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్ గా మహేశ్ మురళీధర్ భగవత్
  • రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌ర్‌ గా డీఎస్ చౌహాన్‌
  • లా అండ్ ఆర్డ‌ర్ అదనపు డీజీగా సంజ‌య్ కుమార్ జైన్.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + nine =