హైదరాబాద్ సిటీ జనులందరికీ అద్భుతమైన గుడ్ న్యూస్ చెప్పబోతోంది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే చాలాచోట్ల అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ప్రతిరోజు వేలాదిమంది కడుపు నిండుతున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ కేంద్రాల ద్వారా కేవలం ఐదు రూపాయలకే బలమైన పౌష్టికాహారాన్ని తెలంగాణ ప్రభుత్వం అందజేస్తూ వస్తున్నాయి తెలంగాణలో కొలువు దీరిన ప్రభుత్వాలు. వివిధ పనుల కోసం హైదరాబాద్‌కు వచ్చినవారితో పాటు హైదరాబాద్ లో ఉద్యోగాలు , ఉపాధి అవకాశాల కోసం వస్తున్నవారు, ఇంట్లో తినే అవకాశం లేని వాళ్లు ఇలా చాలామంది అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ప్రతిరోజు కడుపు నింపుకుంటున్నారు.
5 రూపాయలు అంటే దేనికి పనికిరాదు అన్న ఇలాంటి పరిస్థితుల్లో కమ్మని భోజనం అందించడంతో రోజురోజుకు దీనికి ఆదరణ పెరుగుతోంది. అయితే ఇలా ప్రతి రోజు మధ్యాహ్నం పూట అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ఐదు రూపాయలకే కమ్మని భోజనం అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ..ఇక ఇప్పుడు ఉదయం సమయంలో కూడా అదే 5 రూపాయలను నామమాత్రం తీసుకుని.. అందరి కడుపు నింపడానికి సిద్ధమవుతున్నట్లు అనేది తెలుస్తుంది.
హైదరాబాద్ వాసులందరికీ త్వరలోనే అన్నపూర్ణ కేంద్రాల ద్వారా టిఫిన్స్ ను కూడా తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాబోతుందట . ప్రభుత్వ ఆదేశాలతో దీనిపై ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తులు కూడా చేస్తున్నారట. అన్నపూర్ణ కేంద్రాలతో పాటు మరో 50 కేంద్రాలను కూడా జీహెచ్ఎంసి పరిధిలో అందుబాటులోకి తీసుకోవాలని అధికారులు అనుకుంటున్నారట.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE