అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ భారత్ లోను తన తన జోరు చూపిస్తున్నారు. ఎన్నికల వేళ ఎంతో మంది ఇండియన్స్ దృష్టి ట్రంప్ వైపు మళ్లాయి. అయితే ఇప్పుడు ట్రంప్ ఇండియన్స్ కి మరింత దగ్గరవుతున్నారు. తెలంగాణలో ట్రంప్ టవర్స్ నిర్మించనున్నారు. భారత్‌లో ఇప్పటికే నాలుగు నగరాలు ముంబై, కోల్‌కతా, గుర్గావ్, పుణెల్లో ట్రంప్ టవర్స్ నిర్మించిన ఆ సంస్థ.. తాజాగా మరో ఆరు టవర్లను నిర్మించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌తోపాటు నోయిడా, బెంగళూరుతోపాటు పుణెలో మరో టవర్‌ను నిర్మించనుంది. దీంతో భారత్‌లో ట్రంప్ టవర్ల సంఖ్య 10కి చేరనుంది.
అమెరికా బయట అత్యధికంగా ట్రంప్ టవర్లు భారత్‌లోనే ఏర్పాటు కానున్నాయి. కాగా, హైదరాబాద్‌లో స్థానిక మంజీరా గ్రూప్‌తో కలిసి జంట టవర్లు నిర్మించే యోచనలో ట్రంప్ నిర్మాణ సంస్థ ఉంది. మాదాపూర్‌లో ఖానామెట్‌లో ట్రంప్ ట్విన్ టవర్ల నిర్మాణం భారీ స్థలంలో చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. 2022లో మాదాపూర్‌లోని ఖానామెట్ ప్రాంతంలో 2.92 ఎకరాల స్థలాన్ని హెచ్ఎండీఏ వేలంలో కొనుగోలు చేశారు. ఈ టవర్లు 27 అంతస్తులతో 4 – 5 బెడ్‌రూం ల అపార్టుమెంట్లుగా నిర్మించనున్నారు. 4 బెడ్‌రూం అపార్టుమెంట్ల విస్తీర్ణం 4,000 నుండి 5,000 చదరపు అడుగులు ఉండగా, 5 బెడ్‌రూం అపార్టుమెంట్ల విస్తీర్ణం 6,000 చదరపు అడుగులు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇక అంతర్జాతీయ సంస్థ కావడం ఆ పేరే ఓ బ్రాండ్ కావడంతో ప్రైస్ కూడ అలానే ఉండబోతుంది. చదరపు అడుగుకు రూ.13 వేలుగా ధరను నిర్ణయించాలని అప్పట్లో భావించారు. నాటి లెక్క ప్రకారమే నాలుగు బెడ్‌రూంల అపార్టుమెంట్ ధర రూ.5.5 కోట్లు కానుంది. ఇక ఇతర నగరాల్లో ట్రిబెకా డెవలపర్స్‌తో కలిసి నిర్మించే టవర్లలో అపార్టుమెంట్లే కాకుండా.. ఆఫీసులు, విల్లాలు, గోల్ఫ్ కోర్స్‌లు ఉండనున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్ లో కొన్ని అపార్ట్‌మెంట్స్ మాత్రమే ఇంత పెద్ద విస్తిర్ణంలో జరిగింది. ఇప్పుడు ట్రంప్ టవర్స్‌లో ఇంత పెద్ద విస్తిర్ణం రావడం హైదరాబాద్ మార్కేట్ లో కొత్త అనే చెప్పాలి..!