తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక మరియు మహారాష్ట్ర లకు బస్సులు నడిపేందుకు టిఎస్ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలకు నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సేవలు, ఆరు నెలల అనంతరం తిరిగి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 28, సోమవారం నుంచి కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు బస్సులు నడిపేందుకు టిఎస్ఆర్టీసీ అధికారులు సిద్ధమయ్యారు. మరోవైపు ఆ రాష్ట్రాల యొక్క ఆర్టీసీ బస్సులు కూడా తెలంగాణకు రానున్నాయి. అయితే బెంగళూరుకు మాత్రం బస్సు సర్వీసులు నడపవద్దని ప్రభుత్వం సూచించింది. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి నాందేడ్, ముంబయి, పుణె, నాగ్‌పూర్, చంద్రాపూర్, రాయచూర్, బీదర్, గుల్బర్గా తదితర ముఖ్యమైన మార్గాల్లో టిఎస్‌ఆర్టీసీ బస్సులు నడపనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu