
తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకం ఇప్పటికీ ఎటూ తేలడం లేదు . కేంద్ర కేబినెట్ ఏర్పాటు, ఆ తర్వాత పరిణామాల్లో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక తెరపైకి వచ్చి కాస్త హడావిడి జరిగినా, ఆ తర్వాత మళ్లీ ఆ ఊసు వినిపించలేదు. కేంద్రమంత్రిగా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డిని జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా నియమించడంతో.. ఆయన అటు మంత్రిగా పార్లమెంట్ సమావేశాలలో, ఇటు కశ్మీర్ బాధ్యతలతో బిజీగా ఉంటున్నారు. కశ్మీర్ ఎన్నికలు వచ్చే సెప్టెంబర్ నెలాఖరుకు జరిగే అవకాశముండటంతో..అప్పటి వరకూ అధ్యక్షుడిగా ఆయన తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించే పరిస్థితులు కనిపించడం లేదు.
మరోవైపు ఈ పదవిలో ఎవరిని నియమించాలనే విషయంపై బీజేపీ అధినాయకత్వం ఇంకా పూర్తిస్థాయి స్పష్టతకు రాలేదు. దీంతోనే ఇది కొంతకాలం పాటు పెండింగ్‌లో పడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. తెలంగాణలో యువమోర్చా, మహిళా మోర్చాల వంటి విభాగాలు అప్పుడప్పుడూ.. ఆయా అంశాలు, సమస్యలపై నిరసనలు, దీక్షలు వంటివి చేస్తున్నా పెద్దనాయకులెవరూ పాల్గొనకపోవడంతో అవి జనాలను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి.
మరోవైపు కొత్త అధ్యక్షుడి ఎంపికపై కొన్నాళ్లుగా తెలంగాణ బీజేపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ అధ్యక్షుడి పదవి కోసం ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, అర్వింద్ ధర్మపురి, ఎం.రఘునందన్‌రావు వంటి నేతలు గట్టిగా పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. కేంద్రమంత్రిగా, బీజేపీ నేతగా రెడ్డి సామాజికవర్గానికి అవకాశం ఇవ్వడంతో..బీసీ వర్గాల నుంచే కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈటల రాజేందర్ పేరు దాదాపుగా ఖరారై ప్రకటించడమే తరువాయి అన్న సమయంలో.. మళ్లీ ఏవో కారణాలతో వాయిదా పడినట్టుగా వార్తలు వినిపించాయి.
మరోవైపు బీజేపీ అధ్యక్షుడిగాఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి ఒకరి ఎంపిక ఉండొచ్చునని కొందరు అభిప్రాయపడుతున్నారు. పార్టీపరంగా చూస్తే ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పార్టీ సీనియర్ నేతలు చింతా సాంబమూర్తి,దుగ్యాల ప్రదీప్‌కుమార్, కాసం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు,యెండల లక్ష్మీనారాయణ, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి,యెండల లక్ష్మీనారాయణ, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి టి.ఆచారి, ఎం.ధర్మారావు డా.జి. మనోహర్‌రెడ్డి ఈ పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఇలా అధ్యక్ష పదవి కోసం పాత,కొత్త నేతలల మధ్య తీవ్రస్థాయిలో పోటీ నెలకొనడంతో కేంద్ర అధినాయకత్వం ఎటూ తేల్చుకోల్చుకోలేని పరిస్థితుల్లో పడినట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF