నారాయణపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రారంభించిన కేటీఆర్, సమీకృత కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపన

Minister KTR Inaugurates BRS Party office in Narayanpet Laid Foundation Stone for Integrated Collectorate SP Office,Minister KTR Inaugurates,BRS Party office in Narayanpet, Laid Foundation Stone,Integrated Collectorate,SP Office,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం నారాయణపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రమంత్రులు మహమూద్‌ అలీ, నిరంజన్‌రెడ్డిలతో కలిసి మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ముందుగా నారాయణపేటలో నూతనంగా నిర్మించిన బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిని మంత్రి కేటీఆర్ జిల్లా అధ్యక్ష సీట్లో బెట్టి, శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే మంత్రులు మహమూద్‌ అలీ, నిరంజన్‌రెడ్డి లతో కలిసి నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్మించే సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవనానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం నారాయణపేట జిల్లాలో చేపట్టే అప్పక్‌పల్లి-కోయిల్‌కొండ డబుల్‌ రోడ్డు నిర్మాణం, ధన్వాడ తహసీల్దార్ కార్యాలయం, ధన్వాడ, నారాయణపేట రూరల్‌ పోలీస్‌స్టేషన్లు, సేవాలాల్‌ భవన్‌, మరికల్‌ మండల కార్యాలయ భవన నిర్మాణాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. నారాయణపేట పట్టణంలో నిర్మించిన ఆధునిక సమీకృత మార్కెట్ సముదాయాన్ని, నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్మించిన సఖి కేంద్రాన్ని కూడా మంత్రులు ప్రారంభించారు. అనంతరం నారాయణపేట పట్టణంలో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిధులతో అభివృద్ధి చేసిన కొండారెడ్డిపల్లి మినీ ట్యాంక్ బండ్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్ రాజేందర్‌రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల అనంతరం జరిగే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని, ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =