తెలంగాణలో ఇప్పుడు హరీష్ రావు చుట్టూనే రాజకీయం నడుస్తోంది. అన్ని పార్టీల కన్ను ఇప్పుడు హరీష్ రావు పై పడింది. రాజకీయ పార్టీలే కాదు ప్రజల దృష్టి సైతం హరీష్ రావు పైనే ఉంది. హరీష్ రావు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు. అయితే తెలంగాణలో పంట రుణమాఫీపై హరీష్ రావుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య పెద్ద వారే నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీశ్ రావు గతంలో సవాల్ విసిరారు. అయితే దీన్ని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం. పంట రుణమాఫీ చేస్తామని హరీష్ రావు రాజీనామా కి సిద్ధంగా ఉండాలంటూ ప్రతి సవాల్ విసురుతూ వస్తోంది. మొత్తానికి పంట రుణమాఫీ చేసే సమయం ఆసన్నమవడంతో ఏం జరునుందోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఈ నెలాఖరులోగా రూ.1.5 లక్షల రైతుల రుణాలు మాఫీ అవుతాయని, ఆగస్టు నాటికి రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయడం ద్వారా రైతుల ఆత్మగౌరవాన్ని నిలబెడుతోందని కాంగ్రెస్ కార్యకర్తలు రైతులకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీశ్ రావు గతంలో అన్న మాటలను సీఎం గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేస్తున్నామని అలాగే నువ్వు అన్నమాట నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకి సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించామన్నారు రేవంత్ రెడ్డి. మరి రానున్న రోజుల్లో ఇచ్చిన మాట ప్రకారం హరీష్ రావు రాజీనామా చేస్తారా లేదా అనేది తెలియాలంటే 2 లక్షల రుణమాఫీ పూర్తి కావల్సిందే.
ఇక హరీష్ రావును కేంద్రమంత్రి, బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్ ప్రశంసించారు. బీఆర్ఎస్‌లో హరీష్ రావు ఒక్కరే మంచి రాజకీయ నాయకుడు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. హరీష్‌కు ఉద్యమకారుడిగా గుర్తింపుతో పాటు మంచిగా పనిచేస్తారన్న పేరు ఉందన్నారు. బీజేపీలో చేరాలనుకున్న ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిందేనన్నారు. హరీష్ రావు రావాలనుకున్న రాజీనామా చేసి రావాల్సిందేనన్నారు బండి సంజయ్. ఇక గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్, బీజేపీ విలీనం అంటూ జరుగుతున్న ప్రచారం పైనా క్లారిటీ ఇచ్చారు బండి. అలాంటి ప్రతిపాదనేమి లేదన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ చేస్తున్న ఫేక్ ప్రచారం మాత్రమేనన్నారు. తెలంగాణలో బీజేపీ 8 స్థానాలు గెలిచిందని.. బీఆర్ఎస్ ఎక్కడుందన్నారు బండి. అయితే హరీష్ రావు రాజీనామా చేస్తే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లనున్నానరనే ఊహాగానాలు మొదలయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE