వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ: కుర్మేడు గేటు వద్ద వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష

Kurmed Gate, Mango News, Nalgonda Dist, Nirudyoga Nirahara Deeksha, YS Sharmila, YS Sharmila Conducting Nirudyoga Nirahara Deeksha, YS Sharmila’s Nirudyoga Nirahara Deeksha at Kurmed Gate in Nalgonda, YSRTP Chief YS Sharmila, YSRTP Chief YS Sharmila Nirudyoga Nirahara Deeksha, YSRTP Chief YS Sharmila’s Nirudyoga Nirahara Deeksha, YSRTP Chief YS Sharmila’s Nirudyoga Nirahara Deeksha at Kurmed Gate, YSRTP Chief YS Sharmila’s Nirudyoga Nirahara Deeksha at Kurmed Gate in Nalgonda Dist

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రస్తుతం ‘ప్ర‌జా ప్ర‌స్థానం’ పేరుతో పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఓవైపు ప్రజాప్రస్థానం పాదయాత్ర చేపడుతూనే ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం వైఎస్ షర్మిల నిరాహార దీక్షలు చేస్తున్నారు. అందులో భాగంగా 15వ వారం (నవంబర్ 2, మంగళవారం) నాడు ఉమ్మడి నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి మండలం కుర్మేడు గేట్ వద్ద వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. నిరుద్యోగ దీక్షలో భాగంగా ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి ఆమె దీక్షలో కూర్చున్నారు. కుర్మేడు గేటు వద్ద వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష ఉదయం 8 గంటలకు ప్రారంభమవగా, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, మహిళలు, నిరుద్యోగులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ