హుజురాబాద్ – 20వ రౌండ్ పూర్తి : ఈటల రాజేందర్ కు 21,015 ఓట్ల ఆధిక్యం

Huzurabad Assembly Election Results, Huzurabad Assembly Election Results 2021, Huzurabad By-election Votes Counting Live Updates, Huzurabad bypoll, Huzurabad bypoll results, Huzurabad bypoll results live, Huzurabad bypoll results live updates, Huzurabad constituency, huzurabad election exit poll results, huzurabad election results, Huzurabad Election Results 2021, huzurabad election results exit poll, huzurabad exit poll 2021, Huzurabad exit poll results, huzurabad results, Mango News
  • 20వ రౌండ్‌ లో కూడా బీజేపీ 1474 ఓట్ల ఆధిక్యం సాధించడంతో, ఈటల రాజేందర్‌ సమీప టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై 21,015 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 
  • హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 25 వేల మెజారిటీ దిశగా వెళ్తున్నారు. 19వ రౌండ్‌లో ఈటల రాజేందర్ కు 3,047 ఓట్ల ఆధిక్యం లభించగా, మొత్తంగా 19,541 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు బీజేపీకి 91,306, టీఆర్ఎస్ కి 71,771 ఓట్లు, కాంగ్రెస్‌ కు 2660 ఓట్లు పోలయ్యాయి.
  • హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 17వ రౌండ్లో కూడా బీజేపీ ఆధిక్యం సాధించింది. 17వ రౌండ్లో బీజేపీకి 5610, టీఆర్‌ఎస్‌ కు 4187 ఓట్లు రావడంతో బీజేపీ 1423 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. దీంతో 17వ రౌండ్‌ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ మొత్తం 14,618 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
  • హుజురాబాద్ లో బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారీ ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. వరుసగా 8, 11 రౌండ్లలో తప్ప, మిగతా అన్ని రౌండ్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 14 రౌండ్ల కౌంటింగ్ అనంతరం తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై ఈటల రాజేందర్ 9,434 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 14 రౌండ్స్ పూర్తయేప్పటికీ బీజేపీకి 63,079, టీఆర్‌ఎస్ కు‌ 53,627, కాంగ్రెస్‌ కు 1830 ఓట్లు లభించాయి.
  • హుజురాబాద్ లో ఇప్పటివరకు 11 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. ముందుగా 8వ రౌండ్ లో స్వల్ప (162ఓట్ల) ఆధిక్యం సాధించిన టీఆర్ఎస్ పార్టీ, 11 రౌండ్‌ లో మరోసారి ఆధిక్యం సాధించింది. 11వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ కు 4326, బీజేపీకి 3941, కాంగ్రెస్‌ కు 104 ఓట్లు వచ్చాయి. దీంతో 11వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 367 ఓట్ల ఆధిక్యం లభించింది. అయితే ఇప్పటివరకు బీజేపీకి 48,588, టీఆర్‌ఎస్‌ కు 43,324 ఓట్లు రావడంతో, తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 5,264 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
  • తొమ్మిది రౌండ్ల కౌంటింగ్ అనంతరం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 5,105 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 9వ రౌండ్‌లో బీజేపీకి 5,305, టీఆర్ఎస్ కు 3,470, కాంగ్రెస్‌ 174 ఓట్లు లభించడంతో ఈటల రాజేందర్ కు 1835 మెజార్టీ వచ్చింది. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్ లో ఈటలకు లభించిన అత్యధిక మెజార్టీ ఇదే. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సొంత ఊరు హిమ్మత్ నగర్లో కూడా ఈటల కు 191 ఓట్ల ఆధిక్యం లభించింది.
  • హుజురాబాద్ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ దూసుకెళ్తున్నారు. వరుసగా ఆరు రౌండ్లలో కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆరు రౌండ్ల కౌంటింగ్ అనంతరం తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై ఈటల రాజేందర్ 3,186 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆరో రౌండ్ లో బీజేపీకి 4656, టీఆర్‌ఎస్ కు‌ 3639, కాంగ్రెస్‌కి ‌180 ఓట్లు లభించాయి. దీంతో ఇప్పటివరకు బీజేపీకి 26,983, టీఆర్‌ఎస్ కు‌ 23,797, కాంగ్రెస్‌ కు 992 ఓట్లు లభించాయి.
  • హుజురాబాద్ లో ఐదో రౌండ్ కౌంటింగ్ ముగిసింది. ఐదో రౌండ్లో బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్‌ కు 4,358, టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌ కు 4,014, కాంగ్రెస్ అభ్య‌ర్థి బల్మూరి వెంకట్‌ నర్సింగ్ రావుకు 132 ఓట్లు లభించాయి. ఐదో రౌండ్ల అనంతరం ఈట‌ల రాజేంద‌ర్ 2,169 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు ఇప్పటివరకు బీజేపీకి 22,237, టీఆర్ఎస్ కు 20,158, కాంగ్రెస్ కు 812 ఓట్లు వచ్చాయి.
  • హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మూడు రౌండ్ల అనంతరం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 1,269 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వరుసగా మూడురౌండ్లలో కూడా ఈటల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
  • హుజురాబాద్ లో రెండో రౌండ్ కౌంటింగ్ ముగిసింది. రెండో రౌండ్లో బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్‌ కు 4,851, టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌ కు 4,659, కాంగ్రెస్ అభ్య‌ర్థి బల్మూరి వెంకట్‌ నర్సింగ్ రావుకు 220 ఓట్లు లభించాయి. రెండు రౌండ్ల అనంతరం ఈట‌ల రాజేంద‌ర్ 359 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
  • హుజురాబాద్ లో మొదటి రౌండ్ కౌంటింగ్ ముగిసింది. మొదటి రౌండ్ అనంతరం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 166 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీకి 4610, టీఆర్‌ఎస్ కు‌ 4444, కాంగ్రెస్ కు 119 ఓట్లు లభించాయి.
  • హుజురాబాద్ లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ కు ఆధిక్యం.
  • మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 753 కాగా , ఇందులో టీఆర్ఎస్‌ అభ్యర్థికి 503 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 159 ఓట్లు, కాంగ్రెస్‌ కు 32 ఓట్లు వచ్చాయి. అలాగే 14 ఓట్లు చెల్లనవి ఉన్నట్టుగా తెలిపారు.

 

—-> తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ నెలకొల్పిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు పక్రియ ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. కరీంనగర్‌ లోని ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. ముందుగా 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించి, అనంతరం ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. మొత్తం 22 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుండగా, ఒక్కో హళ్లో 7 టేబుళ్ల చొప్పున మొత్తం రెండు హాళ్లలో 14 టేబుల్స్ పై కౌటింగ్ జరుగుతుంది. ఒక్కో రౌండ్‌కు 30 నిమిషాల స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. అలాగే 5 వీవీ ప్యాట్లలోని స్లిప్పులను కూడా లెక్కించనున్నారు. ఇక తుదిపలితం సాయంత్రంలోగా వెలువడే అవకాశం ఉంది. హుజురాబాద్ నియోజకవర్గంలో అక్టోబర్ 30న జరిగిన పోలింగ్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా 86.64 శాతం (2,05,236 ఓట్లు) పోలింగ్ నమోదైంది.

—-> హుజూరాబాద్ పోరులో 30 మంది బరిలో నిలిచినప్పటికీ, ముఖ్యంగా ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యే త్రిముఖ పోరు నెలకుంది. బీజేపీ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ తరపున బల్మూరి వెంకట్‌ నర్సింగ్ రావు మధ్యే త్రిముఖ పోటీ నెలకుంది. మూడు పార్టీల కీలక నేతలు కూడా ఈ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పెద్దఎత్తున ప్రచారం నిర్వహించడంతో ప్రజాతీర్పు ఎవరివైపు ఉందోనన్న ఆసక్తి రాష్ట్ర ప్రజల్లో నెలకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 11 =