రీ ఎగ్జామ్ అక్కర్లేదంటూ అఫిడవిట్‌లో కేంద్రం వెల్లడి

NEET UG Counseling In Third Week Of July, NEET UG Counseling,UG Counseling In Third Week Of July,Neet Counseling,NEET,NEET UG 2024 Counselling, Affidavit, Does Not Want Re Exam, NEET UG 2024 Paper Leak,Live Updates,Politics,Political News, Mango News, Mango News Telugu

నీట్‌ యూజీ 2024 పరీక్షలో జరిగిన అవకతవకలకు ఇండియా అట్టుడికి పోయింది. విద్యార్ధులు రోడ్లపైకి వచ్చి నిరసనలతో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఈ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.అయితే తాజాగా సుప్రీంకోర్టుకు కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేసి..దానిలో  పలు అంశాలను ప్రస్తావించింది. నీట్‌ యూజీ ఎగ్జామ్‌లో పెద్దగా అవకాతవకలు జరగలేదని, అందుకు ఆధారాలు కేడా లేవని కొట్టిపడేసింది. ఎగ్జామ్ ను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని చెప్పింది. మే 5న పరీక్షకు హాజరైన 24 లక్షల మంది విద్యార్ధుల భవితవ్యంపై  నిరాధారమైన అనుమానాలతో ఇప్పుడు భారం పడుతుందని పేర్కొంది. అందుకే అడ్మిషన్లకు చివరి దశ అయిన కౌన్సెలింగ్‌ను జులై మూడో వారంలోనే ప్రారంభిస్తామని అత్యున్నత ధర్మాసనానికి కేంద్రం వెల్లడించింది.

ఒకవేళ ఎవరైనా అభ్యర్థి ఈ పరీక్షలో అక్రమాలకు పాల్పడినట్లు తేలితే మాత్రం, కౌన్సెలింగ్ ఏ దశలో ఉన్నా, కౌన్సెలింగ్‌ తర్వాత కూడా ఆ అభ్యర్థి ప్రక్రియను రద్దు చేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు స్పష్టం చేస్తూ.. అఫిడవిట్‌ను సమర్పించింది. దీనిపై జులై 11న జరగాల్సిన నీట్ విచారణను  జులై 18కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. కేంద్రంతో పాటు ఎన్‌టీఏ దాఖలు చేసిన ప్రతులు కొన్ని పక్షాలకు ఇంకా అందలేదని చెప్పిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం .. అందుకే ఈ కేసును వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.

నీట్‌ పరీక్షలో అవకతవకలు, పేపర్ లీకేజీతో.. నీట్‌ యూజీ ప్రవేశ పరీక్షను మళ్లీ నిర్వహించాలని సుప్రీంకోర్టులో కొందరు పిటిషనర్లు డిమాండ్ చేశారు. అయితే మరికొందరేమో మళ్లీ పరీక్ష నిర్వహించొద్దంటూ పిటిషన్లు వేశారు. దీంతో   నీట్ పరీక్షలో చోటు చేసుకున్న అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. విచారణ పురోగతికి సంబంధించిన రిపోర్టును తమకు సమర్పించినట్లు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తెలిపింది. నీట్‌ -2024 పరీక్షా ఫలితాల డేటాను అనాలసిస్ చేసి.. ఐఐటీ మద్రాస్‌ ఇచ్చిన రిపోర్టుతో జులై 10న కేంద్రప్రభుత్వం అదనపు అఫిడవిట్‌ను దాఖలు చేసింది. అభ్యర్ధులు పొందిన మార్కులలో స్పెషల్ గా 550 నుంచి 720 వరకు పెరుగుదల కనిపించిందని డేటా వెల్లడించింది. ఈ పెరుగుదలకు సిలబస్‌లో 25 శాతం తగ్గింపే కారణమని చెప్పింది. అవకతవకలు జరిగినట్లు నివేదిక ఎక్కడా కూడా ప్రస్తావించలేదని అందులో చెప్పింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY