బిగ్ బాస్ సీజన్ 8 ఊహించని ట్విస్టులతో ఆడియన్స్ లో క్రేజ్ ను పెంచుతుంది. అన్ లిమిలెట్ వైల్డ్కార్డ్ఎంట్రీలు, ఓకే వారంలో డబుల్ ఎలిమినేషన్ తో హౌస్‌ను హీటెక్కిస్తున్నాడు బిగ్ బాస్. వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో హౌస్ లోకి ఎవరొస్తున్నారనే చర్చ జోరుగా జరుగుతున్న వేళ .. సడెన్‌గా మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ మైండ్ బ్లోయింగ్ అనౌన్స్ మెంట్ చేశాడు బిగ్ బాస్.
గురువారం ఎపిసోడ్లో.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆదిత్య ఓంను మిడ్ వీక్ ఎలిమినేట్ చేయడం షాకింగ్ గా మారింది. ఇంతకీ మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయిన ఆదిత్య ఓం రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడనే విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది. గత సీజన్లో కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ అర్థరాత్రి టైంలోనే చేపట్టిన బిగ్ బాస్ ఈ సారికూడా అదే ఫాలో అవుతున్నాడు. పడుకున్న కంటెస్టెంట్లందర్నీ నిద్రలేపి.. నామినేషన్లలో ఉన్నవారిని వరుస నిలబెట్టి అందులో నుంచి ఆదిత్య ఓం ఎలిమినేట్ చేశారు.
ఈ వీక్ నామినేషన్లలో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్లలో నబిల్, నిఖిల్, మణికంఠ లీడ్లో ఉండటంతో వారిని ముందుగానే సేవ్ చేశారు. మిగిలినవారిలో ఆదిత్య ఓం, నైనిక, విష్ణు ప్రియ మాత్రం డేంజర్ జోన్లో ఉన్నట్టు బిగ్ బాస్ ప్రకటించాడు. ఈ ముగ్గురిలో ఒకరిని ఎలిమినేట్ చేసే బాధ్యతను హౌస్ మేట్స్ కు ఇవ్వడంతో.. ఒక్కొక్కరు ఒక్క కారణం చెప్పుతూ.. వారిని ఎగ్జిట్ గేట్ వైపు తీసుకెళ్లారు. ఈ ప్రాసెస్లో ఎక్కువ మంది కంటెస్టెంట్లు ఆదిత్య ఓం బయటకు వెళ్లడానికి ఓట్లు వేయడంతో..విష్ణు ప్రియ, నైనిక సేఫ్ కాగా.. ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యారు.
అయితే ఈ ఐదు వారాలకు ఆదిత్య ఓంకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారనేది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకూ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లలో.. ఆదిత్య ఓం ఎక్కవనే రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆదిత్య ఓం వారానికి దాదాపు 3 లక్షలు రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంటే రోజుకు 42, 857 రూపాయలు తీసుకున్నట్టు. ఇక హీరో ఆదిత్య ఓం బిగ్ బాస్ హౌస్ లో దాదాపు 33 రోజులు ఉండటంతో..14 లక్షల 14 వేల 281 రూపాయలు పారితోషికం తీసుకున్నట్టు అవుతుంది. అయితే ఆదిత్య ఓం వారానికి 3 లక్షలు కాదు 5 లక్షల రూపాయలు తీసుకున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.