మామ.. మామకు తగ్గ అల్లుళ్లు. ఏపీ ఎన్నికల ఫలితాల్లో రికార్డులు బద్ధలు కొట్టారు ఆ మామ అల్లుళ్లు. మామ ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారు. అటు అల్లుళ్లు ఒకరు ఎమ్మెల్యేగా.. మరొకరు ఎంపీగా గెలుపొందారు. అది కూడా రికార్డులు బద్ధలు కొడుతూ అత్యంత భారీ మెజార్టీతొ గెలుపును కైవసం చేసుకున్నారు. వారే నందమూరి బాలకృష్ణ.. ఆయన అల్లుళ్లు నారా లోకేష్, శ్రీ భరత్.
నందమూరి బాలకృష్ణ గత రెండు ఎన్నికల్లో హిందూపురం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. ముచ్చటగా మూడోసారి కూడా గెలుపొంది హ్యాట్రిక్ సాధించాలని ఉవ్విళ్లూరారు. టీడీపీ తరుపున మూడోసారి హిందూపురం నుంచి బరిలోకి దిగారు. హ్యాట్రిక్ విజయం కోసం తీవ్రంగా చమటోడ్చారు. చివరికి అనుకున్నది సాధించారు. హిందూపురం నియోజకవర్గం నుంచి మూడోసారి నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రతీ రౌండ్‌లోనూ బాలయ్య ఆధిక్యంలో నిలుస్తూ వచ్చారు. చివరికి 31,602 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి టీఎన్ దీపికపై విజయం సాధించారు.
అటు ఎక్కడ ఓడామో అక్కడే గెలిచి తీరాలన్న పట్టుదలతో మరోసారి మంగళగిరి నుంచి నారా లోకేష్ బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో మంగళగిరిలో కేవలం 5 వేల ఓట్ల తేడాతో లోకేష్ మంగళగిరిలో ఓడిపోయారు. ఈసారి గెలుపే లక్ష్యంగా కష్టపడ్డారు. చివరికి ఓడిన చోటే అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. 20 ఏళ్లలో మంగళగిరిలో గెలిచింది లేదు. కానీ తొలిసారి నారా లోకేష్ 91 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో మంగళగిరిలో విజయ దుందుభి మోగించి సరికొత్త చరిత్ర సృష్టించారు.
అటు విశాఖ నుంచి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ టీడీపీ తరుపున ఎంపీగా పోటీ చేశారు. రికార్డులు బద్ధలు కొడుతూ విశాఖలో శ్రీ భరత్ గెలుపొందారు. ఏకంగా నాలుగు లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పటి వరకు విశాఖలో ఏ ఎంపీ కూడా అంతటి మెజార్టీ సాధించిన దాఖలాలు లేవు. అటు మామ ఇద్దరు అళ్లులు ఘన విజయం సాధించడంతో బాలకృష్ణ ఇంట్లో విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు. బాలయ్యకు ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY