కందుకూరు ప్రమాదం దురదృష్టకరం – జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan Responds over Kandukur Incident Condoles Loss of Lives of 8 People,AP Police Registered Case,Stampede Incident,TDP Chief Chandrababu Road Show,Kandukur Chandrababu Stampede Incident,Mango News,Mango News Telugu,Stampede at TDP Meeting,TDP Meeting in Kandukur,TDP Chief Chandrababu,Chandrababu's Public Meeting,Chandrababu Meeting in Kandukur,Chandrababu Meeting,Chandrababu Kcr,Chandrababu Meeting Live,Chandrababu Kuppam Tour,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కందుకూరులో జరిగిన సభలో తోపులాట జరగడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. కందుకూరులో తెలుగుదేశం పార్టీ సభ జరుగుతుండగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతి చెందడం, మరి కొందరు ఆసుపత్రి పాలవడం చాలా దురదృష్టకరమని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

“ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుదన్ను. అటువంటి కార్యకర్తలు ఇలా ప్రమాదం బారినపడి మృతి చెందడం ఎంతో విచారకరం. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆసుపత్రి పాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =