దేశవ్యాప్తంగా దాదాపు 48 కోట్ల మంది వినియోగదారుల తో జియో నంబర్ 1 టెలికాం సంస్థ గా ఉంది. అయితే ఇటీవల రిలయన్స్ జియో టారిఫ్ ఛార్జీలను పెంచింది. దీంతో అన్ని రీఛార్జ్ ధరలు పెరిగాయి. పెరిగిన ధరల ను భరించలేక వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త రేట్లతో 19 నుండి 20 కొత్త ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. కొన్ని ప్లాన్‌ల ధరను కంపెనీ పెంచింది. అయితే జూలై ప్రారంభంలో ప్లాన్‌ల ధరలను పెంచిన తర్వాత కంపెనీపై విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో ఆగస్టు ప్రారంభానికి ముందు కంపెనీ 3 కొత్త ప్లాన్‌లను కూడా ప్రవేశపెట్టింది. వీటి ధర తక్కువ అని పేర్కొంది. మీరు రిలయన్స్ జియో వినియోగదారు అయితే 28 రోజుల నుంచి ఎక్కువ కాలం చెల్లుబాటుతో వచ్చే జియో 3 చౌక ప్లాన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రిలయన్స్ జియో ప్లాన్ రూ. 329 ప్రయోజనాలు
పెరిగిన ధరల పై సామాన్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో కొన్ని రీఛార్జ్ ప్లాన్ విషయంలో బిగ్ రిలీఫ్ ఇచ్చింది. రూ.329 రీఛార్జ్ ప్లాన్. ఈ ప్లాన్ ధర చాలా తక్కువ అంతే కాదు ఈ ప్లాన్ లో ప్రయోజనాలు ఉన్నాయి. మీరు ప్రతిరోజూ 1.5GB డేటా ప్రయోజనం పొందుతారు. ఇది కాకుండా అపరిమిత కాలింగ్, రోజువారీ 100 SMS సౌకర్యం ఉంది. అంతేకాకుండా OTT ప్లాట్‌ఫారమ్ ప్రయోజనం కూడా ఉంది. ఈ ప్లాన్‌తో JioSaavn ప్రో సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది.
జియో రీఛార్జ్ ప్లాన్ రూ. 949 ప్రయోజనాలు
రిలయన్స్ జియో ప్లాన్ రూ. 949 కి వస్తుంది. దీనితో పాటు అపరిమిత కాలింగ్ సౌకర్యం, రోజువారీ 2GB డేటా, రోజువారీ 100 SMS లు అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా డిస్నీ + హాట్‌స్టార్ ఉచిత సభ్యత్వం అందుబాటులో ఉంది. మీరు జియో యాప్‌లను కూడా ఉచితంగా ఉపయోగించవచ్చు. ఈ ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో వస్తుంది.
రిలయన్స్ జియో ప్లాన్ రూ. 1049 ప్రయోజనాలు
Jio రూ. 1049 కొత్త ప్లాన్‌ను కలిగి ఉంది. ఇది 84 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో మీరు ప్రతిరోజూ 2 GB డేటా ప్రయోజనం పొందుతారు. అంతేకాకుండా మీరు అపరిమిత కాలింగ్‌ను కూడా ఆస్వాదించవచ్చు. ప్రతిరోజూ 100 SMSలతో పాటు, Zee5-SonyLiv కాంబోకు సభ్యత్వం, Jio యాప్‌లకు యాక్సెస్ కూడా అందుబాటులో ఉంది.