బిగ్ బాస్ సీజన్ 8 ఈ వారం ఎలిమినేషన్ రెండు రోజుల ముందుగానే జరగనున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ 8 ఎనిమిదో వారం గంగవ్వ ఎలిమినేషన్ వాలంటీర్‌గా జరగనుందని వార్త వినిపిస్తోంది. ఈ రెండు రోజుల్లోనే గంగవ్వ ఇంటి నుంచి అవుట్ అవనుందని టాక్ వస్తోంది. బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ఈ మధ్యే రసవత్తరంగానే సాగుతోందన్న టాక్ తెచ్చుకుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లో కావాల్సినంత కామెడీ, గొడవలు, ఫైట్స్ జరుగుతుండటంతో ఆడియన్స్ ఆసక్తిగా గమనిస్తున్నారు. నామినేషన్స్ సమయంలో ఈ గొడవలు మరింత మసాలను యాడ్ చేసినట్లుగా ఉంటున్నాయి.
అయితే ఈ వారం నామినేషన్స్‌లోనే లేని కంటెస్టెంట్ గంగవ్వ.. ఈవీక్ మధ్యలోనే ఎలిమినేట్ అయి హౌజ్‌ను వీడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు 8 ఎనిమిదో వారం ఆరుగురు కంటెస్టెంట్స్ నిఖిల్, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, ప్రేరణ, పావని, మెహబూబ్ నామినేట్ అయ్యారు. అయితే వీరిలో ఎవరూ కాకుండా మధ్యలో గంగవ్వ వాలంటీర్‌గా ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా అటవీశాఖ అధికారులు గంగవ్వపై కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ గంగవ్వతో పాటు యూట్యూబర్ అయిన రాజుపై జగిత్యాల అటవీశాఖ అధికారులకు.. జంతు సంరక్షణ కార్యకర్త అయిన ఆదులాపురం గౌతమ్ ఫిర్యాదు చేశారు. గంగవ్వ బిగ్ బాస్ కు రాకముందు మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానెల్‌తోనే ఎక్కువ పాపులర్ అయింది..
అలా బిగ్ బాస్ తెలుగు 4 సీజన్ తర్వాత కూడా మై విలేజ్ షో యూట్యూబ్ ఛానెల్‌లో గంగవ్వ చాలా వీడియోలు చేస్తూ అలరించింది. రెండేళ్ల క్రితం యూట్యూబర్ రాజు, గంగవ్వ ఓ వీడియోలో భాగంగా జ్యోతిష్యం కోసం చిలుకను ఉపయోగించారు . 2022, మే 20న గంగవ్వ చిలుక పంచాగం అనే ఈ వీడియోను అప్‌లోడ్ చేశారు.
ఈ వీడియోను సాక్ష్యంగా చేసుకుని.. సొంత ప్రయోజనాల కోసం మూగ జీవాలను హింసించి, వన్య ప్రాణుల రక్షణ చట్టం ఉల్లంఘించారని గౌతమ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై యూట్యూబర్ రాజును ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక గంగవ్వను కూడా అరెస్ట్ చేస్తారన్న టాక్ నడుస్తోంది.
ప్రస్తుతం బిగ్ బాస్ 8 సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అడుగుపెట్టిన గంగవ్వ తన దైన కామెడీతో అలరిస్తోంది. ఒకవేళ గంగవ్వను అరెస్ట్ చేయాల్సి వస్తే.. ఈ వీక్ గంగవ్వ వాలంటీర్‌గా ఎలిమినేట్ అవుతుందని అంటున్నారు. దీంతో ఈ వారం ఎలిమినేషన్ కూడా రెండు రోజుల ముందుగానే ప్లాన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ బిగ్ బాస్ 8 ఎనిమిదో వారం ఎలిమినేషన్ శుక్రవారం జరగనుందని, శనివారం నాడు దీపావళి స్పెషల్ ఎపిసోడ్ షూట్ చేయనున్నట్లు టాక్ నడుస్తోంది.