బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8కి ఈ మధ్య ఆడియన్స్ బాగానే పెరుగుతున్నారు. టీఆర్ఫీ కూడా మెల్లమెల్లగా పెరుగుతూ వస్తోంది. వైల్డ్ కార్డ్ పేరు చెప్పి, ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ పెంచడంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. గత సీజన్లలో బాగా ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే పంచిన కొంతమంది కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసి మరీ .. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి దించడంతో కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ దొరుకుతుంది.
వైల్డ్ కార్డ్ ఎంట్రలతో బిగ్ హౌస్‌కి కొత్త కలొచ్చిందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈ సీజన్ విన్నర్ ఎవరా.? అనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా జరుగుతుంది. కొంతమంది అయితే తెలంగాణ అబ్బాయి నబీల్ ఈసారి విన్నర్ అంటూ చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే మొదట్లో కామ్ గోయింగ్ అనిపించిన నబీల్..తనను తాను మెల్ల మెల్లగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాడు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల్లో మంచి పనితనం చూపించడంతో పాటు, హౌస్ మేట్స్ మధ్య కూడా పాజిటివిటీ సంపాదించుకున్నాడు.
దీంతో నబీల్ ఈ సారి బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అవుతాడని టాక్ నడుస్తోంది. అంతేకాదు, లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన కిరాక్ సీత కూడా ఇదే కోరుకున్న విషయం తెలిసిందే. హోస్ట్ నాగార్జున దృష్టిలో కూడా నబీల్‌కి మంచి పేరే ఉంది. ఎలా చూసుకున్నా.. ఈ సారి బిగ్‌బాస్ కప్పు గెలుచుకునేది మాత్రం నబీలే అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ బిగ్‌బాస్‌లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. మంచిగా అనుకున్నవాళ్లు బయట చెడుగా ప్రమోట్ కావొచ్చు. నెగిటివ్ అని అంతా అనుకున్నవాళ్లు మంచి వాళ్లుగానూ కనిపించొచ్చు. సో..నబీల్‌పై ఆ అభిప్రాయం చివరి వరకూ ఇలాగే ఉంటుందా? లేక మధ్యలోనే ఎలిమినేట్ అవుతాడా అనేది మాత్రం చూడాలి.