గూగుల్‌లో సెర్చ్‌లో మీ పర్సనల్ డేటా కనిపిస్తోందా?

Delete data from search results,Delete data from search,data from search results,Mango News,Mango News Telugu,Remove this result,Were taking a look,Results About You,Results to review,Google Search results,Manage and delete your Search history,Google Search History,Private Information from Google,Remove your personal data,Clear Your Google Search History,Google Search results Latest News,Google Search results Latest Updates
Remove this result,We're taking a look,Results About You,Results to review,Google Search results,

టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ డిజిటల్ రంగం దూసుకుపోతోంది. అయితే టెక్నాలజీ అన్ని పనులను ఎంత ఈజీ చేస్తుందో మనుష్యుల పర్సనల్ లైఫ్‌ను అంతగా బట్టబయలు చేసేస్తుంది.  ఇంకా చెప్పాలంటే ఈ డిజిటల్ యుగంలో..మన వ్యక్తిగత డేటా అత్యంత విలువైనదిగా మారిపోయిందనే చెప్పొచ్చు.కేవలం  జనాల పర్సనల్ డేటా యాక్సెస్ ‌ చేయడానికే ఎంతోమంది సైబర్ నేరగాళ్లు పనిచేస్తున్నారంటేనే దీని తీవ్రత అర్థం చేసుకోవచ్చు.

 

డేటా చౌర్యంలో దొరికిన సమాచారంతో అమాయకులను బెదిరించడం, బ్యాంక్‌ అకౌంట్‌లను కూడా యాక్సెస్‌ చేసి ఖాతాలు ఖాళీ చేసేయడం వంటివి చేస్తున్నారు. అందుకే సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత డిటైల్స్, డేటాను షేర్‌ చేయకూడదు. అలాగే ఆన్ లైన్ లావాదేవీలు చేస్తున్నప్పుడు  ప్రైవసీ చెక్ చేసుకోవాలి. అలా గూగుల్ సెర్చ్‌లో పర్సనల్ డేటా కనిపిస్తే..ఆ డేటాను ఎలా రిమూవ్‌ చేయాలని ఆలోచించేవారి కోసం.. గూగుల్‌ ఓ కొత్త ఆప్షన్‌ తీసుకొచ్చింది.

 

గూగుల్ సెర్చ్  రిజల్ట్స్ నుంచి పర్సనల్ డేటాను రిమూవ్ చేయడానికి  ..గూగుల్  ‘రిమూవ్ దిస్ రిజల్ట్’ అనే కొత్త ఫీచర్ ను ఇంట్రడ్యూస్ చేసింది.  అయితే ఈ ఫీచర్  అంతర్జాలంలో కానీ, స్పెసిఫిక్  వెబ్ సైట్ నుంచి సమాచారాన్ని తొలగించలేదు. అంటే మన వ్యక్తిగత డేటా ఎప్పటికీ ఇంటర్నెట్‌లోనే  ఉంటుంది.  కానీ మన  పేరుతో సెర్చ్ చేసినప్పుడు మాత్రం.. గతంలో లాగా  గూగుల్ సెర్చ్  రిజల్ట్ ‌లో మాత్రం డేటా కనిపించదు.దీనివల్ల వేరే వారెవరయినా ..మన పేరు సెర్చ్  చేసి వివరాలు తెలుసుకోవడం సాధ్యం కాదు. వినియోగదారులు గూగుల్ సెర్చ్  రిజల్ట్స్ ‌ నుంచి మొబైల్ నంబర్,  ఈ మెయిల్ అడ్రస్‌, ఇంటి అడ్రస్  తొలగించు కోవచ్చు.

 

సెర్చ్ రిజల్ట్స్  నుంచి డేటా తొలగించడానికి..ముందు  వెబ్ బ్రౌజర్ ను ఓపెన్  చేసి, మై యాక్టివిటీ డాట్ గూగుల్ డాట్ కామ్ స్లాస్ రిజల్ట్స్ ఎబౌట్ యూ లింక్ ఓపెన్ చేయాలి. తర్వాత’రిజల్ట్స్  టూ రివ్యూ’ అనే  ఆప్షన్ ను  సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ‘గెట్  స్టార్టెడ్  అనే’ ఆప్షన్ పైన క్లిక్‌ చేసాక..’నెక్స్ట్  అనే బటన్ పై వరుసగా రెండు సార్లు క్లిక్ చేయాలి.

 

ఆ తర్వాత ‘వి ఆర్  టేకింగ్ ఏ లుక్  అనే పాప్అప్ మెసేజ్ వస్తుంది.  ఇప్పుడు గూగుల్ నుంచి నోటిఫికేషన్స్  వచ్చే వరకూ  వేచి ఉండాలి.అలా అలర్ట్‌ వచ్చినప్పుడు, సెర్చ్ రిజల్ట్స్ నుంచి ఎంటర్  చేసిన మన పర్సనల్ ఇనఫర్మేషన్ తీసేయాలా , అలాగే ఉంచాలా అని నిర్ణయించుకోవచ్చు. అయితే  ముందుగా ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసేటప్పుడు.. ఏమైనా తప్పులు ఎంటర్ చేసినట్లు అనిపిస్తే కరక్షన్స్ చేయడానికి ‘రిజల్ట్స్  అబౌట్ యు’ పేజీకి తిరిగి వెళ్లొచ్చు. అలాగే  తమ గూగుల్ అకౌంట్లోని ‘డేటా అండ్ ప్రైవసీ’ ఆప్షన్లోకి వెళ్లి రిక్వెస్ట్ ను కూడా  ట్రాక్  చేయెచ్చు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =