బిగ్‍బాస్ సీజన్ 8 నుంచి ఎలిమినేట్ అయ్యాక బజ్ ఇంటర్వ్యూలో కిర్రాక్ సీత ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.ఆదివారం ఎపిసోడ్‍లో సీత బయటికి వచ్చేశారు. ఎలిమినేట్ అయ్యాక ఎమోషనల్ అయి కన్నీరు పెట్టుకున్న ఆమె బయటికి వచ్చాక బిగ్‍బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
సీతను బజ్ ఇంటర్వ్యూకు వెల్‍కమ్ చేసిన యాంకర్ అంబటి అర్జున్.. బజ్‍లో ముందు తాను మాట్లాడతానని, అది విన్నాక మాట్లాడాలంటూ సీతతో అంటాడు. దీనిలో భాగంగా బిగ్‍బాస్ అనేది లైఫ్‍టైమ్ అవకాశమని.. దాన్ని సరిగా వాడుకున్నారా అని అర్జున్ ప్రశ్నించగా ఎవరి ఆలోచన వారిదని, తాను 100 శాతం ఇచ్చానని సీత చెబుతుంది. టాస్కుల్లో తాను కాకుండా ఇతరులను ముందుకు పంపడమే తాను డౌన్ అవడానికి రీజన్ అయి ఉండొచ్చని కిర్రాక్ సీత చెప్పింది.
హౌస్‍లో మీ పతనం ఎప్పుడు మొదలైందో గమనించారా అని అర్జున్ అడగగా..“‘టాస్క్ వచ్చినప్పుడు వేరే వాళ్లను పుష్ చేయడం వల్ల డౌన్ అయ్యానేమోనని నేను అనుకుంటున్నా. నాకూ తెలియదని సీత సమాధానమిస్తుంది. తన నిర్ణయాల మీద ఎక్కువసార్లు కాన్ఫిడెంట్‍గా ఉంటానని సీత అంటుంది. దీనికి మనకు అనిపించింది మనం రైట్ అనుకుంటాం కానీ అది బయటికి అలా కనిపించదని అర్జున్ కౌంటర్ ఇస్తాడు. దీనికి సీత అది లెక్కలు వేసుకొని గేమ్ ఆడినట్టు. అది రియల్ గేమ్ కాదని గట్టిగా రీ కౌంటర్ ఇస్తుంది సీత.
ఏడ్వడం స్ట్రాంగా అని అర్జున్ అడగగా.. “అరవడం స్ట్రాంగా.. మీరు స్ట్రాంగ్ అని ఏమనుకుంటున్నారో అది తప్పని నాకు అనిపిస్తోందని సీత అంటుంది. మంచితనమో కొంప ముంచిందని అనిపించిందా అని అర్జున్ అడిగితే.. అలా అని నా క్యారెక్టర్ మార్చుకోలేనని సీత రిప్లై ఇస్తుంది. సోనియాకు నిఖిల్ రెడ్ ఎగ్ ఇచ్చినప్పుడు ఎందుకు ఏడ్చారని సీతను అర్జున్ అడుగుతాడు. నిఖిల్ హౌస్ లోని గేమ్ చూసి ఇస్తాడనుకున్నానని, కానీ పర్సనల్ ఎమోషన్లతో ఇచ్చారని చెబుతుంది. నిఖిల్‍ను హస్బెండ్ మెటీరియల్ అని సీత అనడంపై అర్జున్ ప్రశ్నించగా.. నిఖిల్ ఒకడే ఒకరి వెంట పడ్డాడని చెప్తుంది సీత.