బిగ్ బాస్ సీజన్ 8లో… నిఖిల్ ,మణికంఠ మొదటి మూడు వారాలు వీళ్లిద్దరూ చాలా క్లోజ్ గా ఉండేవారు. కానీ ఆ తర్వాత మణికంఠలోని షేడ్స్ చూసి షాక్ కి గురైన నిఖిల్ మణికంఠను దూరం పెట్టడం మొదలు పెట్టాడు. కానీ వీళ్లిద్దరూ స్నేహంగా ఉన్నన్ని రోజులు వీరి మధ్య వచ్చే జోక్స్ చాలా సహజంగా ఉండేవి. అలాగే వాళ్ల క్లోజ్ నెస్ చూసి చాలామంది తమ మిత్రులను గుర్తుచేసుకునేవారు. అయితే చేతులారా తనకు తానుగా ఈ బంధాన్ని నాశనం చేసుకున్నాడు మణికంఠ. సోనియా హౌస్ లో ఉన్న చివరి వారంలో, చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశాన్ని త్యాగం చేసాడు మణికంఠ.
అంతేకాదు అవతల క్లాన్ వాళ్లు ప్రతీసారి మణికంఠనే తీసేస్తున్నారు, ఇది అన్యాయమని నెట్టింట్లో చర్చలు జరగడం కూడా జరిగింది. వాళ్ళు మణికంఠని ఎందుకు తీశారుని అడిగితే.. వాడే త్యాగం చేసాడు అని నిఖిల్ చెప్పాడు. కానీ దీనికి మణికంఠ తాను అలా చేయలేదు అని అబద్దం చెప్పడంతో నిఖిల్‌కి మైండ్ బ్లాక్ అయ్యేంత పని అయింది. అందుకే నిఖిల్ మణికంఠ ని నామినేట్ చేసి, అతనితో ఉన్న ఆ స్నేహాన్ని పూర్తిగా కట్ చేసుకున్నాడు. ఆ రోజు నుంచి మణికంఠకి దూరంగా ఉంటూ వస్తున్న నిఖిల్.. అప్పుడప్పుడు తమ పాత స్నేహాన్ని బయట పెట్టుకుంటూనే ఉన్నారు.
తాజాగా కిచెన్ లో వీళ్లిద్దరూ కలిసి అంట్లు తోముతుండగా జరిగిన ఒక క్యూట్ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మణికంఠ సోప్ సరిగా పెట్టరా అని నిఖిల్‌తో అనగా అది తాను కడిగింది కాదని నిఖిల్ సమాధానమిస్తాడు.అప్పుడు మణికంఠ అది తనకు తానే చెప్పుకున్నాను లేరా’ అని కవర్ చేస్తాడు. దానికి నిఖిల్ నా కొడకా నువ్వు చేయాల్సింది చేసి.. నన్ను సోప్ సరిగా పెట్టరా అంటున్నావా’ అని అనగా మణికంఠ నవ్వే వీడియోను ఇప్పుడు నెటిజన్లు తెగ చూస్తున్నారు.వీరిద్దరి స్నేహానికి మరోసారి మార్కులు వేస్తున్నారు.
అంతేకాదు ఈ వీడియోని చూసిన వాళ్లంతా.. మళ్లీ కలిసిపోండి, మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.కానీ మణికంఠతో స్నేహం అంటేనే హౌస్ మేట్స్ భయపడుతున్నారు. అతనిని దగ్గరకు చేరదీసిన ప్రతీసారి వాళ్లే ఫూల్ అవడంతో కాస్త డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తున్నారు. వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ కూడా మణికంఠ వింత ప్రవర్తన చూసి షాక్ అయ్యారు.