
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగియడంతో.. గెలుపోటములపైనే అందరి దృష్టి పడింది. అయితే ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందా అంటూ భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్న నియోజకవర్గం ఉండి కూడా ఒకటి. ఇక్కడ ఒకే సామాజికవర్గానికి చెందిన నలుగురు కీలకమైన నేతలు..అందులోనూ ఆర్థికంగా బలమైన నేతలే పోటీ పడటంతో ఏపీ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
రాజకీయంగా టెన్షన్ పెడుతున్న కీలకమైన నియోజకవర్గం గురించి చెప్పాలంటే ఉండి పేరు కచ్చితంగా ఉంటుంది. ఉమ్మడి పశ్చిమ గోదా వరి జిల్లాలోని ఉండి నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు వరకు అనుకోని మలుపులు తీసుకుంటూనే ఉన్నాయి అక్కడి రాజకీయాలు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక, నామినేషన్ల ప్రక్రియ జరిగాక కూడా అక్కడి నేతలను టెన్షన్ పెట్టేశాయి. ఉండి టికెట్‌ను చివరి నిముషంలో ఎంపీ రఘురామకృష్ణ రాజుకు చంద్రబాబు కేటాయించడంతో.. సొంత పార్టీ నుంచే చాలా ఇబ్బందులు వచ్చి పాలిటిక్స్ కొత్త టర్న్ తీసుకున్నాయి.
ఉండి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధిగా పీవీఎల్ నరసింహరాజు పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన నాయకుడు వేగేశ్న వెంకట గోపాల కృష్ణంరాజు బరిలో దిగారు. అయితే త్రిముఖంగా ఉండాల్సిన పోరు స్వతంత్ర అభ్యర్థిగా కలువపూడి శివరామరాజు పోటీ చేయడంతో చతుర్ముఖం అయిపోయింది. ప్రతీ నేత ఎవరికి వారే ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని గెలుపే లక్ష్యంగా కష్టపడ్డారు.
ఉండిలో నలుగురు బలమైన అభ్యర్ధుల మధ్య పోటీ ఎక్కువగా ఉండడంతో.. అధికార పార్టీ కాస్త వెనుకబడిందని అంటున్నారు. అలా అని రఘురామకు టీడీపీ కేడర్ పూర్తిగా సహకరించిందా అంటే అదీ డౌటే అంటున్నారు. న్యాయం జరుగుతుందా? అంటే.. టీడీపీలో పరిస్థితి గుంభనంగా మారింది. రఘురామ కృష్ణరాజు ఒకసారి ఇక్కడ గెలిస్తే పాతుకుపోతారని టీడీపీ నేతలే ఆయనకు సహకరించలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఎవరు గెలిచినా తక్కువ మెజారిటీతోనే గెలుస్తారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు సందిట్లో సడేమియాల్లా ఈ నలుగురి రాజుల్లో గెలిచే రాజెవరంటూ కాయ్ రాజా కాయ్‌లు బిజీ అయిపోయారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY