బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరి గ్రాఫ్ ఎప్పుడు ఎలా పైకి ఎగబాకుతుందో.. ఎవరిది ఎప్పుడు పడిపోతుందో ఎవరూ ఊహించలేరు.గత సీజన్లో వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్.. అదే వారం బ్యాగు సర్దుకుని వెళ్లాల్సింది. కానీ ఇప్పుడు ఏకంగా విన్నర్ రేసులోనే నిలబడ్డాడు. వార్ వన్ సైడ్ అయిపోయింది..ఇక నిఖిల్ ట్రోఫీ పట్టుకెళ్లడం ఖాయమని అంతా వేసిన లెక్కలను కాదని ఇప్పుడు అతనికే పోటీ ఇస్తున్నాడు.
ఇటు యాంకర్ విష్ణుప్రియ.. పృథ్వీపైన కోపం తెచ్చుకుని రెబల్‌గా మారిందనుకుని అంతా అనుకునే లోపు.. అతడిని కన్నందుకు థాంక్యూ అంటూ ఏకంగా పృథ్వీ తల్లి కాళ్లపైనే పడింది. ఇటు ఎంతో కూల్‌గా, నవ్విస్తూ ఉండే టేస్టీ తేజ ఈమధ్య ఆవేశం స్టార్‌గా మారిపోయాడు. ఇక బిగ్ బాస్ హౌస్‌లో చాలామందికంటే ప్రేరణ నయం అనుకునేలోపు.. ఆమె తన విశ్వరూపాన్ని చూపిస్తోంది.
ఇంటి సభ్యులందరి మీదా నోరు పారేసుకుంటూ ఇప్పుడు ప్రేరణ విపరీతమైన నెగెటివిటీ సంపాదించుకుంది. మెగా చీఫ్ అవ్వాలని ఫస్ట్ వీక్ నుంచి ఆశపడిన ప్రేరణ.. ఎట్టకేలకు పదోవారంలో చీఫ్ అయింది. కానీ చీఫ్ అయ్యాక తనలోని రియల్ కారెక్టర్ బయటకు తీయడంతో.. తన గ్రాఫ్ పాతాళానికి పడిపోయింది.ముఖ్యంగా విష్ణుప్రియ, గౌతమ్‌లను టార్గెట్ చేయడం, అవినాష్, తేజలపై కూడా నోరు పారేసుకోవడం జనాలకు అస్సలు మింగుడుపడలేదు.
మొత్తానికి ఇటు బిగ్ బాస్ హౌస్‌లో ప్రేరణ మెగా చీఫ్ పదవి ముగిసినపోయింది. ఈసారి అందరూ మెగా చీఫ్ పదవి కోసం పోటీపడగా.. ముక్కు అవినాష్‌కే చీఫ్ పోస్టు దక్కింది. దీంతో.. బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌కు ప్రేరణ నుంచి విముక్తి లభించినట్లేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.