చంద్రయాన్ -3 కథ ముగిసిపోయిందా? ల్యాండర్, రోవర్ శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయినట్లేనా?

Is The Chandrayaan 3 Story Over Lander Rover Going Into Eternal Sleep,Is The Chandrayaan 3 Story Over,Is Lander Rover Going Into Eternal Sleep,Is The Chandrayaan 3 Going Into Eternal Sleep,Mango News,Mango News Telugu,Chandrayaan-3, Is The Chandrayaan-3 Over,Lander, Rover Going To Eternal Sleep,Its Not The End Of Chandrayaan-3 Story,Chandrayaan-3 Details,Chandrayaan 3 Latest News,Chandrayaan 3 Latest Updates,Chandrayaan 3 Live News

చంద్రుడిపై దాగున్న రహస్యాలను కనుక్కోవడానికి ఈ ఏడాది జులై 14న భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ కథ ముగిసిపోయినట్లే కనిపిస్తోంది. భూమిపై నుంచి బయలు దేరిన తర్వాత 40 రోజుల పాటు ప్రయాణం చేసి ఆగస్టు 23న చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ అయింది చంద్రయాన్ 3 . తర్వాత అక్కడి నుండి ఫొటోలు, వీడియోలు కూడా పంపింది చంద్రయాన్ 3. అక్కడ 150 మీటర్ల పాటు ప్రయాణించిన రోవర్, ల్యాండర్ కూడా ఒకదానికొకటి ఫోటోలు తీసుకుని పంపాయి. వాటితో పాటు అక్కడి మూలకాల ఆనవాళ్లను కూడా పంపాయి. ఆ తర్వాత స్లీప్ మోడ్‌కు జారుకున్నాయి. కానీ ఆ రెండు ఇప్పుడు ఏకంగా శాశ్వత నిద్రలోకే వెళ్లిపోయాయా అన్న అనుమానాలను ఇస్రో శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు.

అవును.. ఇస్రో ఇప్పుడు చంద్రయాన్ 3 మిషన్‌లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో తిరిగి సంబంధాలు పునరుద్ధరించలేకపోతుంది. ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ చంద్రుడి ఉపరితలంపై ఉన్న ల్యాండర్, రోవర్ నుంచి ఎటువంటి సంకేతాలు కూడా పొందలేకపోతుంది. చంద్రయాన్ 3 అంతరిక్షంలో 40 రోజుల ప్రయాణం తర్వాత ఆగష్టు 23న .. చంద్రుడి దక్షిణ ధృవం వద్ద అడుగుపెట్టింది. ఆ తర్వాత 14 రోజుల పాటు పరిశోధనలు సాగించాక స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోయింది.

భూమిపై 14 రోజులతో సమానమైన చంద్రునిపై ఒక్క రోజు.. రాత్రి అవడంతో అతి శీతల వాతావరణంలోకి చేరుకున్న ల్యాండర్, రోవర్ రెండూ కూడా మంచుతో కప్పబడిపోయాయి. భూమిపై 14 రోజుల తర్వాత.. తిరిగి పగలు కావడంతో తిరిగి ఈ రెండూ స్లీప్ మోడ్‌లో నుంచి లెగుస్తాయని అంతా అనుకున్నారు. ఇస్రో కూడా వీటితో కనెక్టివిటీ పునరుద్ధరించడానికి చాలా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయినా అక్కడి నుండి ఎలాంటి సిగ్నల్స్ రాకపోవడంతో.. చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ శాశ్వతంగా నిద్రలోకి జారుకున్నట్లే అయింది.

విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తమకు అప్పగించిన పనుల్ని పూర్తి చేసి.. సెప్టెంబర్ 2న స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. రోవర్ శివశక్తి పాయింట్ నుంచి చంద్రుని ఉపరితలంపై 100 మీ. పైగా ప్రయాణించి, చంద్రునిపై సల్ఫర్, ఇనుము, ఆక్సిజన్ , ఇతర మూలకాల ఉనికిని కూడా కనుగొన్నాయి. ఆ తర్వాత నిద్రలోకి జారుకుని ఇంకా లేవలేదు. సెప్టెంబరు 30న జరగనున్న చంద్ర సూర్యాస్తమయం వరకు ల్యాండర్, రోవర్‌తో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఇస్రో తన ప్రయత్నాలను తీవ్రంగా కొనసాగిస్తూనే ఉంది.

ల్యాండర్, రోవర్ పార్క్ చేసిన.. శివశక్తి పాయింట్‌లో సూర్యోదయంలో అవి అక్కడ పరికరాలను తిరిగి తీసుకువస్తుందని ఇప్పటికీ ఇస్రో ఎదురుచూస్తోంది. అయితే ప్రస్తుతానికి చంద్రయాన్-3 పరికరాలతో కనెక్టివిటీ ఎపుడు ఏర్పడుతుందనేది మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతానికి మాత్రం ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ రాత్రి సమయంలో చంద్రుని దగ్గర వాతావరణం కఠినంగా ఉండటం వల్ల వీటి పునరుద్ధరణ అవకాశాలు ఎప్పుడూ తక్కువగానే ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 7 =