
సినిమాల్లో ఏళ్లకు ఏళ్లు ఒక హీరోను ఆదరిస్తూ వచ్చే ఆడియన్స్.. హీరోయిన్ ను మాత్రం యాక్సెప్ట్ చేయరు. అందుకే హీరోలు దశాబ్దాలు దశాబ్దాలు సినీ ఇండస్ట్రీని ఏలుతుండగా.. ఆ హీరోయిన్ సీనియర్ యాక్ట్రెస్ గా మారి ప్రేక్షకుల ముందు కనిపిస్తూ ఉంటుంది.
అంతేకాదు ఒక సినిమాలో తమ హీరోయిన్‌గా నటించిన యాక్టర్‌తోనే.. ఇంకొక సినిమాలో అదే హీరోకి తల్లిగా,చెల్లిగా నటిస్తారు కొంతమంది హీరోయిన్స్. అలా తెలుగు సినీ ఇండస్ట్రీలో నటించిన కొంత మంది హీరోయిన్స్ ఉన్నారు.భానుమతి – భానుమతి,ఎన్టీ రామారావుతో మల్లీశ్వరి, తోడు నీడ సినిమాల్లో నటించి అందరినీ మెప్పించారు. ఆతర్వాత 1992లో వచ్చిన సామ్రాట్ అశోక సినిమాలో ఎన్టీఆర్‌కి తల్లిగా ఆమె నటించారు.
శారద -శారద , సూపర్ స్టార్ కృష్ణతో రాధమ్మ పెళ్లి, ఆడంబరాలు-అనుబంధాలు, ఇంద్రధనస్సు వంటి సినిమాల్లో నటించారు. అలాగే ఆ తర్వాత అగ్ని కెరటాలు, రౌడీ నెంబర్ వన్, అగ్నిపర్వతం సినిమాల్లో కృష్ణకి తల్లిగా శారద నటించారు.
అంజలీ దేవి-అంజలీ దేవి , ఏఎన్ఆర్‌తో కలిసి భక్తతుకారాం, సువర్ణసుందరి సినిమాల్లో నటించి అందరితో మంచి పెయిర్ అనిపించుకున్నారు. తర్వాత కొన్ని సినిమాల్లో ఏఎన్ఆర్‌కి తల్లిగా అదే అంజలీ దేవి నటించారు.వరలక్ష్మి –వరలక్ష్మి, ఎన్టీఆర్‌తో మహామంత్రి తిమ్మరుసు, సత్య హరిశ్చంద్ర సినిమాల్లో సహనటిగా నటించారు. కలియుగ రాముడు, ప్రేమ సింహాసనం, వయ్యారి భామలు వగలమారి భర్తలు, అగ్గి రవ్వ సినిమాల్లో అదే వరలక్ష్మి ఎన్టీఆర్‌కి తల్లిగా నటించారు.
సుజాత-చిరంజీవి, సుజాత కలిసి ప్రేమ తరంగాలు సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. తర్వాత సీతా దేవి సినిమాలో చిరంజీవి, సుజాత అన్నా చెల్లెళ్లుగా నటించారు. చిరంజీవి హీరోగా నటించిన బిగ్ బాస్ సినిమాలో.. మెగాస్టార్ చిరంజీవికి తల్లిగా నటించారు సుజాత.జయసుధ- చిరంజీవి ,జయసుధ కలిసి మగధీరుడు సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. అలాగే ఇది కథ కాదు సినిమాలో కూడా నటించారు. తర్వాత మెగాస్టార్ హీరోగా నటించిన రిక్షావోడు సినిమాలో జయసుధ.. చిరంజీవికి తల్లిగానూ నటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY