బిగ్ బాస్ 8వ సీజన్‌కు మరికొద్ది రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుండటంతో.. గ్రాండ్ ఫినాలేకు డిసెంబర్ 15న డేట్ ఫిక్స్ అయింది. అంతేకాకుండా.. బిగ్ బాస్ షో టైమింగ్స్‌లో కూడా మార్పులు చేశారు. ఈ రోజు నుంచి డిసెంబర్ 2 నుంచి బిగ్ బాస్ 8 సీజన్ టెలికాస్ట్‌లో మార్పు ఉండబోతుంది. మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ 8 టైటిల్ విన్నర్‌ను ప్రకటించనున్నారు. దీంతో ఎప్పటిలాగే గ్రాండ్ ఫినాలే నిర్వహించి.. బిగ్ బాస్ సీజన్ 8 విజేతను ప్రకటించనున్నారు.
పదమూడో వారం టేస్టీ తేజ, పృథ్వీరాజ్ ఇద్దరూ ఎలిమినేట్ అవడంతో.. ప్రస్తుతం ఏడుగురు కంటెస్టెంట్స్ జబర్దస్త్ అవినాష్, గౌతమ్ కృష్ణ, నిఖిల్ , నబీల్ , ప్రేరణ , విష్ణుప్రియ, రోహిణి ఉన్నారు.బిగ్ బాస్ సీజన్ 8 రియాల్టీ షో చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం 14వ వారం నడుస్తుండగా..మంగళవారం బిగ్ బాస్ హౌస్లోకి అనుకోని అతిథి ఎంట్రీ ఇచ్చాడు.
కాగా బిగ్ బాస్ సీజన్ ముగియనుందన్న వార్తలతో టైటిల్ విన్నర్ ఎవరనే చర్చ మొదలైంది. సెప్టెంబర్ 1న బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ గా లాంచ్ చేశారు. కేవలం 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లారు. అయితే పెద్దగా పేరున్న నటులు, బుల్లితెర స్టార్స్ ఎవరూ లేకపోవడంతో..ఆడియన్స్ నిరాశ చెందారు. దీంతో గత సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కి మరోసారి ఛాన్స్ ఇస్తూ.. భారీగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు ప్లాన్ చేశారు.
ఐదు వారాల తర్వాత టేస్టీ తేజ, జబర్ధస్త్ అవినాష్, గంగవ్వ, హరితేజ, గౌతమ్ కృష్ణ, జబర్ధస్త్ రోహిణి, నయని పావని, మెహబూబ్.. ఇలా మొత్తం 8 మంది మాజీ కంటెస్టెంట్స్ బరిలో దింపగా.. వీరిలో ఐదుగురు ఎలిమినేట్ అయి అవినాష్, రోహిణి, గౌతమ్ మాత్రమే మిగిలారు. టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్ నేరుగా ఫైనల్ కి వెళ్లిపోయాడు. ఇక ఫస్ట్ వీక్ నుంచి హౌస్లో ఉన్న వారిలో నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ, నబీల్ పోటీలో ఉన్నారు.
అవినాష్ తప్ప మిగిలిన అందరూ నామినషన్స్ లో ఉండగా.. వీరిలో ఒకరు లేదా ఇద్దరు ఎలిమినేట్ అయ్యి మిగిలినవారు ఫైనల్ కి వెళతారు. కాగా మంగళవారం బిగ్ బాస్ హౌస్లోకి.. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఎంట్రీ ఇచ్చాడు. శేఖర్ మాస్టర్ రాకతో మొదట షాక్ అయిన కంటెస్టెంట్స్ తర్వాత ఫుల్ ఖుషీ అయ్యారు. శేఖర్ మాస్టర్ కంటెస్టెంట్స్ తో సరదా గేమ్స్ ఆడించారు. మొత్తంగా శేఖర్ మాస్టర్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ సందడిగా మారింది.