బిగ్‌బాస్ సీజన్ 8 అప్పుడే 8 వారాలు పూర్తి చేసుకుని 9వ వారంలోకి అడుగుపెట్టింది. 14 మందితో ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌లో ఇప్పటి వరకు బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓం, నైనిక, కిరాక్ సీత, నాగ మణికంఠ, మెహబూబ్ హౌస్‌ను వీడారు. 9వ వారంలో హౌస్‌లో ఐదుగురు నామినేషన్స్‌లో నిలిచినట్లుగా తెలుస్తోందది.
సోమవారం ఎప్పటిలాగే నామినేషన్స్ రచ్చరచ్చగా సాగింది. అయితే రోటిన్‌కు భిన్నంగా ఈసారి కంటెస్టెంట్స్ ఎవర్ని నామినేట్ చేయలేదు. మెగా చీఫ్‌గా ఉన్న విష్ణుప్రియకి నామినేట్ చేసే పవర్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. హౌస్‌లో ఉండటానికి అర్హత లేదని భావించే ఐదుగురు హౌస్ మేట్స్ ను తగిన కారణాలు చెప్పి నామినేట్ చేసి జైల్లో వేయాలని చెప్పాడు. బిగ్‌బాస్ ఆదేశాలతో గౌతమ్, ప్రేరణ, నయని పావని, టేస్టీ తేజ, నబీల్‌లను విష్ణుప్రియ నామినేట్ చేసి జైల్లో వేసింది. అయితే తను మెగా చీఫ్ కావడానికి కారణమైన గౌతమ్, నబీల్‌లను కనికరం లేకుండా నామినేట్ చేయడంతో ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు.
కాగా జైలుకు సంబంధించిన తాళాలను పెట్టి.. వాటిని అందుకున్న కంటెస్టెంట్స్‌లో ఒకరిని నామినేట్..మరొకరి సేవ్ చేయొచ్చని బిగ్ బాస్ చెబుతాడు. అలాగే ఒకసారి కీస్ అందుకున్నవాళ్లు మరోసారి ఆ కీని టచ్ చేయకూడదని, విష్ణుప్రియ ఈ టాస్క్‌లో పాల్గోకూడదని బిగ్ బాస్ కండిషన్స్ పెడతాడు. ముందు ఆ కీస్‌ను అందుకున్న పృథ్వీ.. నబీల్‌ను సేవ్ చేశాక ..తర్వాత అవినాష్‌ను నామినేట్ చేస్తాడు. ఆ తర్వాత యష్మీ.. ప్రేరణను కాపాడి హరితేజను నామినేట్ చేస్తుంది. తర్వాత కీస్‌ను అందుకున్న రోహిణి అవినాష్‌ను సేవ్ చేసి అవినాష్ ను నామినేట్ చేసిన పృథ్వీని జైలులో పెట్టింది. తర్వాత టేస్టీ తేజను కాపాడిన అవినాష్.. యష్మీని నామినేట్ చేస్తాడు. తర్వాత కీస్ అందుకున్న ప్రేరణ .. పృథ్వీని కాపాడి మళ్లీ టేస్టీ తేజను నామినేట్ చేసింది. ఇలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది.