ఫెస్టివల్ సేల్స్ పేరుతో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మోసం చేస్తున్నాయా?

Are Flipkart Amazon cheating in the name of festival sales,Are Flipkart Amazon cheating,cheating in the name of festival sales,Flipkart festival sales,Mango News,Mango News Telugu,Flipkart , Amazon,Cheating , e-commerce site, Flipkart, Amazon, festival sales cheating,festival sales Latest News,festival sales Latest Updates,festival sales Live News,festival sales cheating Latest News
Flipkart , Amazon,Cheating , e-commerce site, Flipkart, Amazon, festival sales cheating,

ఎవరైనా స్మార్ట్ ఫోన్ కొనాలనుకున్నా.. ఇంటికి కావాల్సిన ఎలక్ట్రికల్ వస్తువులు కొనాలన్నా.. చివరకు బట్టలు కొనాలన్నా కూడా ఆన్ లైన్ ఫెస్టివల్ సేల్ వచ్చేవరకూ వెయిట్ చేస్తుంటారు. ఫెస్టివల్ సేల్‌లో చాలా తక్కువ ధరకే తమకు కావాల్సిన వస్తువులు దొరుకుతాయని అనుకుంటారు. అందుకే ఒక ఫోన్ , ల్యాప్ టాప్, టీవీ, ఫ్రిడ్జి, వాషింగ్ మిషన్, ఇతర వస్తువులు ఏవైనా తీసుకోవాలని అనుకున్నవారంతా.. ఫ్లిప్ కార్ట్ లేదా అమెజాన్ ఫెస్టివల్ సేల్ టైమ్‌లో తీసుకోవడానికి ప్లాన్ చేసుకుంటారు.

అయితే నిజంగానే ఫెస్టివల్ సేల్ లో చాలా తక్కువ ధరకే ఆ వస్తువులు దొరుకుతున్నాయా? ఆ వస్తువులు అంత తక్కువ ధరకే ఇచ్చేస్తే.. కంపెనీలకు లాస్ రాదా? ఫెస్టివల్ సేల్ పేరుతో తక్కువ ధరకు అమ్మితే కంపెనీలకు లాభం ఏంటి? పైగా ఆ సమయంలో లక్షలు, కోట్లు పెట్టి సెలబ్రెటీలతో అడ్వర్జైట్ మెంట్స్ చేయించి మరీ వినియోగదారులకు తక్కువ ధరకు ఇస్తే కంపెనీలు లాస్ అవవా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రీసెంట్‌గా ముగిసిన దసరా ఫెస్టివల్ సేల్ తర్వాత ఈ సందేహాలు మరింత ఎక్కువ అయ్యాయి.

నిజానికి బిగ్ బిలియన్ డేస్, గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ పేరుతో తీసుకొచ్చే ఈ సేల్స్ వెనుక.. కేవలం ఆర్బాటం తప్ప అసలు ధరల్లో మార్పులు ఉండవనే విషయాన్ని కొనుగోలుదారుడు అర్ధం చేసుకోవాలి. ఏదైనా ఒక ప్రాడక్ట్ తీసుకునేటప్పుడు దాని ఎమ్మార్పీ ఎంత అని చూడాలి. ఎందుకంటే ప్రతీ వస్తువును కూడా ఏ షాపులో అయినా ఎమ్మార్పీ కంటే తక్కువకే అమ్ముతారన్న విషయం అందరకీ తెలిసిందే. ఫెస్టివల్ టైమ్ లోనే కాదు.. మామూలుగా కూడా ఈ కామర్స్ సంస్థల్లో ఎమ్మార్పీ కంటే తక్కువ ధరకే అమ్ముతారు. కాకపోతే ఫెస్టివల్ సీజన్లో మాత్రం భారీ డిస్కౌంట్ అని ప్రకటనలతో ఊదరగొడతారు. నిజానికి ఫెస్టివల్ టైమ్ లో కాకుండా.. మామూలు టైమ్ లో ఈ కామర్స్ సంస్థలు 10 శాతం, 15 శాతం, 20 శాతం ఇలా ప్రొడక్ట్ ను బట్టి డిస్కౌంట్‌ను అందిస్తుంటాయి.

అసలు నిజంగా ఈ కామర్స్ సైట్లలో పెట్టే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అనేది కూడా కస్టమర్లను ఆకట్టుకునే ట్రిక్ తప్ప.. అందులో కస్టమర్‌కు ఒరిగిందేమీ ఉండదు. ఎక్స్చేంజ్ ఆఫర్‌లో మనమిచ్చే ప్రొడక్ట్ వివరాలన్నీ అడుగుతారు. దాని మోడల్ ఏంటి.. తీసుకున్నప్పుడు ధర ఎంత.. దాని కండిషన్ ఏంటనే వివరాలను మెన్షన్ చేయమంటారు. దీంతో ఒక ఎక్స్‌ఛేంజ్ ధరను చూపించి.. దాని డిస్కౌంట్ పోను.. మిగిలిన డబ్బులు పే చేసి కొత్త ఫోన్ ను బుక్ చేసుకోవచ్చంటారు. మీ దగ్గర ఉన్న పాత వస్తువును తీసుకెళ్లడానికి డెలివరీ బాయ్ వచ్చినప్పుడు దాన్ని పరీక్షించి..దాని మీద ఒక చిన్న గీత ఉన్నా కూడా తగ్గిస్తారు. ఉదాహరణకు వెబ్ సైట్ లో మీ పాత ఫోన్‌కు రూ.8000 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ఇస్తామని చెబితే.. డెలివరీ బాయ్ అదీ ఇదీ కారణం చెప్పి రూ.4000 మాత్రమే వస్తాయి అని చెబుతాడు. దీంతో 4వేలు అదనంగా చెల్లించి కొత్త ఫోన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా బయట సెకండ్స్‌లో పాత ఫోన్ అమ్మినా 8 వేలు వచ్చేస్తాయి.

నిజానికి బిగ్ బిలియన్ డేస్ సేల్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ పేర్లతో ఈ కామర్స్ సంస్థలు కొన్ని వేల కోట్ల లాభాలను అర్జిస్తున్నాయి. ఫేక్ ఆఫర్స్ లో భాగంగా ఎమ్మార్పీ ధరలు కూడా పెంచి.. దాని మీద 50 శాతం ఆఫర్ అని చెప్పి కస్టమర్లను బోల్తా కొట్టిస్తారు. అందుకే ఆన్ లైన్ లో ఏదైనా కొనాలని అనుకుంటే ఆఫర్స్ చూసి అస్సలు మోసపోవద్దు. నిజంగా ఆ ప్రాడక్ట్ వాల్యు ఎంత ఉంది అనేది రెండు మూడు సైట్స్‌లో చూసాకే అప్పుడు కొనాలి. కొన్నికొన్నిసార్లు క్లియరెన్స్ సేల్స్ ఉంటాయి. వీటిలో ధర కాస్త తక్కువకే ఉంటుంది. అయినా కూడా ఇప్పటి వరకు దాన్ని ఏ ధరకు అమ్మారు? డిస్కౌంట్ ఎంత? షాపుల్లో ఎంతకు అమ్ముతున్నారని అన్నీ కంపేర్ చేసుకొని కొనాలి. కొన్నిసార్లు డూప్లికేట్ ప్రొడెక్ట్స్ కూడా పెద్ద పెద్ద ఈ కామర్స్ సైట్లలో దర్శనమిస్తున్నాయి కాబట్టి ఏది కొనాలన్నా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఫస్ట్ ఒక బ్రాండెడ్ కంపెనీ డ్రస్ నచ్చి మనం కొనుక్కున్నాం అనుకోండి.. అది క్వాలిటీ బాగోలేదని మనం ప్రొడెక్ట్ రిటర్న్ ఇస్తే.. ఆ సమయంలో మనం పే చేసిన జీఎస్టీ, డెలివరీ ఛార్జీలు వంటి మనీ కట్ చేసుకుని కేవలం దాని రేటు మాత్రమే ఇస్తారు.అదేమని కస్టమర్ కేర్‌ను అడిగినా ఏదో కారణాలు చెబుతారు తప్ప ..మన పూర్తి డబ్బు మనకు తిరిగిరాదు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − nine =