బిగ్‌బాస్ సీజన్ 8లో అందరి కంటే యష్మీ మాత్రం డిఫరెంట్ అన్న టాక్ ఉంది. ఆమె ఎప్పుడు ఎవరిపై ఎందుకు కోప్పడుతుందో .. ఎప్పుడు ఎవరిపై ప్రేమ కురిపిస్తుందో చెప్పడం కష్టం. మొన్నటివరకూ మణికంఠను హౌస్ నుంచి బయటికి పంపడమే జీవిత లక్ష్యం అన్నట్లు రచ్చరచ్చ చేసిన యష్మీ.. శుక్రవారం ఎపిసోడ్‌లో మాత్రం మణికంఠకి నేనున్నా అంటూ పెద్ద పెద్ద డైలాగులు కొట్టింది . ఏకంగా నీ నవ్వు చూసే నీకు పడిపోయా అంటూ మణికంఠకే పులిహోర కలిపేసింది. అయితే తన భార్య ఎంతో ప్రేమగా వండి పంపించిన బిర్యానీని మణికంఠకి దక్కకుండా చేసింది యష్మీ.
బిగ్‌బాస్ టుడే ఎపిసోడ్‌లో ఆదిత్య ఎలిమినేట్ అయ్యాక విష్ణుప్రియ-యష్మీ కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. తర్వాత విష్ణు వెళ్లగానే అక్కడికి పృథ్వీ వచ్చి కూర్చున్నాడు. డల్‌గా ఉన్నావంటూ యష్మీని అడిగితే .. తానే నామినేట్ కదా ఆదిత్య గారిని.. దాని గురించే బాధ అంటూ యష్మీ చెప్పడంతో.. . సర్లే ఫీల్ అవ్వకు అంటాడు పృథ్వీ. దీంతో నువ్వు హ్యాపీగాయే కదా విష్ణు ఉంది అంటూ సెటైర్లు వేసింది యష్మీ.
ఆ తర్వాత మణికంఠను మొత్తం హౌస్‌మెట్స్ టార్గెట్ చేశారు. ముందుగా విష్ణుప్రియ మేమంతా టెన్షన్‌లో ఉంటే.. అప్పుడు కూడా కెమెరాలన్నీ వీడి వైపే ఉండాలి అన్నట్లు.. ఏడుపొకటి మొదలుపెట్టాడు అంటూ విష్ణుప్రియ సరదాగా అంది. దీంతో నాకు ఏం తెలీలేదురా మొత్తం బ్లాంక్ అయిపోయిందంటూ ఎప్పటిలానే మణికంఠ అన్నాడు. దీనికి నబీల్ .. అదేంటి సైరన్ మోగగానే మిడ్ వీక్ ఎలిమినేషన్ అని నువ్వే చెప్పావంటగా మరెందుకు బ్లాంక్ అంటూ అన్నాడు.తర్వాత అక్కడికి వచ్చిన సీత.. ఎందుకు నువ్వు మాటిమాటికి అందరూ నిన్ను ఓదార్చాలి అన్నట్లుగా బిహేవ్ చేస్తావ్ అనడంతో.. మణి అక్కడి నుంచి సైడ్ అయిపోయాడు.
ఇక తర్వాత హౌస్‌మెట్స్ అందరికీ బిగ్‌బాస్ ఓ ఫన్నీ టాస్కు ఇచ్చాడు . “నేను చెప్పిందే జరుగుద్ది.. జాతకం చెప్పాలి..” అంటూ సాగిన ఈ టాస్కులో మణికంఠ మొత్తం హౌస్‌మెట్స్ కి జాతకం చెప్పాల్సి వచ్చింది. ఇక మణికంఠ శర్మ అంటూ బాగానే ఎంటర్‌టైన్ చేసిన మణికంఠతో.. ఈ హౌస్‌లో ఒకరిని ట్రై చేస్తున్నా.. సెట్ అవుతుందా అంటూ పృథ్వీ గురించి అడిగింది విష్ణు. దీనికి బిగ్‌బాస్ పంజరంలో ఇప్పుడున్న ప్రేమ పక్షులు అంటే మీరే.. వైల్డ్ కార్డ్ రూపంలో ఎవరైనా వస్తే మీ ప్రేమకి క్రాక్ వచ్చే ఛాన్స్ ఉందని.. లేకపోతే ఇలానే సాగిపోతుందని జాతకం చెబుతాడు.
అలా సరదాగా సాగిపోయిన తర్వాత సడెన్‌గా యష్మీని కన్ఫెషన్ రూమ్‌కి రమ్మని బిగ్‌బాస్ పిలిచాడు. ముందు కుశల ప్రశ్నలతో మొదలెట్టి హౌస్ ఎలా ఉందంటూ అడిగాడు బిగ్‌బాస్. తర్వాత యష్మీ మీ ముందున్న క్లాత్ తీయాలని.. మీ ముందు ఉన్న డిషెస్‌లో నిఖిల్ వాళ్ల అమ్మ చేసిన వంట.. మణికంఠకి వాళ్ల వైఫ్ చేసిన ఇంటి వంట వచ్చాయ్ అని బిగ్‌బాస్ చెప్పాడు . ఆలోచించి ఎవరికి ఇంటి వంట చెందాలో ఒకరికి ఇమ్మంటాడు. దీంతో మణికంఠ కంటే ఎక్కువ నిఖిల్ ఇంట్లో వాళ్లని మిస్ అవుతున్నాడు అనిపించింది.. కనుక నిఖిల్‌కి ఇస్తా.. అంటూ యష్మీ చెప్పింది. మణికి ఇక్కడ హౌస్‌లో ఎక్కడక్కడ లవ్ ఇవ్వాల్సి వస్తే మేమందరం ఇస్తున్నాం.. కనుక ఫుడ్ నిఖిల్‌కే ఇస్తా అంటూ యష్మీ చెప్పింది. ఇక తర్వాత మణికంఠను కాదని .. ఫుడ్ తీసుకెళ్లి నిఖిల్ చేతిలో పెట్టిన యష్మీ ఓ హగ్ ఇచ్చింది.