పదో తరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

10th Class Exams, Arrangements For SSC Exams, Government Examinations, Secondary School Certificate, SSC exams, SSC Exams Arrangements, SSC Exams News, SSC Exams Updates, Telangana 10th Class Exams, Telangana Education Department, telangana ssc exams, Telangana SSC Exams 2020, Telangana SSC Exams Schedule

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఇటీవలే రాష్ట్ర విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర ప్రాంతాల్లో ప్రైవేట్‌ స్కూళ్ల హాస్టళ్లలో ఉండి చదువుకున్న పదో తరగతి విద్యార్థులకు వారి సొంత ప్రాంతాల్లోనే పరీక్ష రాసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. హాస్టల్స్ లో ఉండి చదువుకున్న విద్యార్థులకే ఈ అవకాశం కల్పిస్తున్నారు.

దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల హాల్‌టికెట్ల వివరాలు, వారు నివాసముంటున్న ప్రాంతాలు, పరీక్ష రాయాలనుకునే సెంటర్లు తదితర వివరాలను సంబంధిత డీఈవోలకుగాని/ పదో తరగతి పరీక్షల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ కేంద్రాలకు గాని జూన్ 7వ తేదీ వరకు తెలియజేయాలని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే కేటాయించిన కేంద్రాల్లో పరీక్షలు రాయలేని విద్యార్థులు ఈ అవకాశాన్ని వాడుకోవాలని తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu