దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతుంది. దీంతో పాజిటివ్ కేసులు రోజురోజుకి పెద్ద సంఖ్యలో నమోదవుతూ లక్షకు చేరువయ్యాయి. జూన్ 11, గురువారం నాటికి మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 97,648 కి చేరింది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 3607 కొత్త కేసులు నమోదవగా, కరోనా వలన 152 మంది మృతి చెందారు. దీంతో ఆ రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య కూడా 3590 కి చేరింది. మొత్తం కేసుల్లో 46,078 మంది కోలుకోగా, ప్రస్తుతం 47,980 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.
ఇప్పటిదాకా ముంబయి నగరంలో 54085, థానే లో 15679, పుణేలో 10882, ఔరంగాబాద్ లో 2306, పాల్గర్ లో 1842, నాసిక్ లో 1746, రాయఘడ్ లో 1636, సోలాపూర్ లో 1578, జల్గాన్ లో 1366 కేసులు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో 2600 మందికి పైగా పోలీసు సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పోలీస్ శాఖ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu