ఐపీఎల్-2023 మినీ వేలం కోసం ఏ ప్రాంచైజీ వద్ద ఎంత నగదు ఉందంటే?

IPL 2023 Mini-auction Details About Available Salary Cap of 10 Franchises,IPL 2023 Mini-auction,Salary Cap of 10 Franchises,IPL Mini-auction,Mango News,Mango News Telugu,IPL 2023,IPL Franchises,IPL Retained Players List,IPL Released Players List,IPL Retained Players,IPL Released Playeu,IPL Mumbai Indians,Mumbai Indians,IPL Latest News And Updates,Indian Premier Leauge,Indian Premier Leauge News And Live Updates

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2023 కోసం ఆటగాళ్ల మినీ వేలం ప్రక్రియ డిసెంబర్ 23న కొచ్చిలో జరగనుంది. ఈ వేలానికి ముందు పది ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లతో పాటుగా విడుదల చేసిన/వదులుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. పది ప్రాంఛైజీలు కలిపి 163 మంది ఆటగాళ్లను కొనసాగించగా, 85 మంది ఆటగాళ్లను వారి ప్రస్తుత జట్టుల నుండి విడుదల చేశారు. ఆటగాళ్లను రిటైన్ చేసుకునే విండో గడువు ముగియడంతో మినీ వేలంలో పాల్గొనేందుకు ఒక్కో ప్రాంచైజీ వద్ద శాలరీ క్యాప్/ఎంత నగదు ఉంది?, ఒక్కో ప్రాంచైజీకి ఎన్ని స్లాట్స్ అందుబాటులో ఉన్నాయి/ఎంతమంది ఆటగాళ్లను తీసుకునే అవకాశం అనే వివరాలు వెలువడ్డాయి.

అత్యధికంగా సన్ రైజర్స్ హైదరాబాద్ 13 మంది ఆటగాళ్లను (ఓవర్శిస్ స్లాట్స్ 4), కోల్‌కతా నైట్ రైడర్స్ 11 (ఓవర్శిస్ స్లాట్స్ 3), లక్నో సూపర్ జెయింట్స్ 10 (ఓవర్శిస్ స్లాట్స్ 4), ముంబయి ఇండియన్స్ 9 (ఓవర్శిస్ స్లాట్స్ 3), పంజాబ్ కింగ్స్ 9 (ఓవర్శిస్ స్లాట్స్ 3), రాజస్థాన్ రాయల్స్ 9 (ఓవర్శిస్ స్లాట్స్ 4), గుజరాత్ టైటాన్స్ 7 (ఓవర్శిస్ స్లాట్స్ 3), రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు 7 (ఓవర్శిస్ స్లాట్స్ 2), చెన్నై సూపర్ కింగ్స్ 7 (ఓవర్శిస్ స్లాట్స్ 2), ఢిల్లీ క్యాపిటల్స్ 5 (ఓవర్శిస్ స్లాట్స్ 2) ఆటగాళ్లను తీసుకునే అవకాశం ఉంది.

వేలం కోసం 10 ప్రాంచైజీల ఖాతాలో ఉన్న నగదు వివరాలివే:

  1. సన్ రైజర్స్ హైదరాబాద్ – రూ.42.25 కోట్లు
  2. పంజాబ్ కింగ్స్ – రూ.31.20 కోట్లు
  3. లక్నో సూపర్ జెయింట్స్ – రూ.23.35 కోట్లు
  4. ముంబయి ఇండియన్స్ – రూ.20.55 కోట్లు
  5. చెన్నై సూపర్ కింగ్స్ – రూ.20.45 కోట్లు
  6. ఢిల్లీ క్యాపిటల్స్ – రూ.19.45 కోట్లు
  7. గుజరాత్ టైటాన్స్ – రూ.19.25 కోట్లు
  8. రాజస్థాన్ రాయల్స్ – రూ.13.2 కోట్లు
  9. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు – రూ.8.75 కోట్లు
  10. కోల్‌కతా నైట్ రైడర్స్ – రూ.7.05 కోట్లు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + sixteen =