ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ఈ రోజు భేటీ కానున్నారు. సోమవారం సాయంత్రం 4:30 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ ను సీఎం వైఎస్ జగన్ మర్యాదపూర్వకంగా కలువనున్నారు. ఇటీవలే రెండు రోజులపాటుగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గవర్నర్ ఉభయసభలనుద్దేశించి వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున గవర్నర్ కు సీఎం వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలుపనున్నారు.
ఈ భేటీలో అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులు, బడ్జెట్ కేటాయింపులు తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. అలాగే ఇప్పటివరకు రాష్ట్రకేబినెట్ లో మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ ఇటీవలే వైసీపీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. కేబినెట్ లో వారి స్థానాలను భర్తీచేయాల్సి ఉండడంతో కేబినెట్ విస్తరణపై కూడా చర్చ జరిగే అవకాశమునట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu



































