కరోనా సోకితే అర్చకులను హేళన చేయడం సరికాదు – చిలుకూరు అర్చకుడు రంగరాజన్

Chilkur, Chilkur Balaji Temple, Chilkur Balaji Temple Closed, chilkur balaji temple priest, chilkur balaji temple priest rangarajan, Chilkur Balaji temple remains closed, Chilkur Balaji Temple Remains Closed for Some More days, coronavirus hyderabad, Coronavirus impact

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో చిలుకూరి బాలాజీ ఆలయంలో మరికొన్ని రోజులు వరకు భక్తులకు దర్శనాలు ఉండవని ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ తెలిపారు. అహాబిలం లక్ష్మీ నరసింహాస్వామి వారి దేవాలయంలో ఉండే అర్చక స్వామికి కరోనా పాజిటివ్ గా తేలిందని, దీంతో అహోబిలం పీఠాధిపతి వారు నిర్ణయం తీసుకొని తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఆలయాన్ని మూసివేయాలని సూచించారని రంగరాజన్ పేర్కొన్నారు.

అలాగే తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు చిలుకూరి బాలాజీ ఆలయంలో కూడా భక్తులకు దర్శనాలు ఉండవని, ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు. కాగా కరోనా సోకిందని అర్చకులను హేళన చేయడం సరికాదని ఆయన చెప్పారు. ప్రతి మనిషికి కరోనా సోకే అవకాశం ఉందన్నారు. పోప్ కైనా, ఇమామ్ కైనా, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవ్వరికైనా కరోనా రావొచ్చని, అర్చకుడికి కరోనా సోకితే టీవీ ఛానెళ్లలో హేళనగా చూపించడం తగదని రంగరాజన్ అన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − two =