తెలంగాణ ముఖ్యంగా జీహెఛ్ఎంసీ ఏరియాలో రోజురోజుకి వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 879 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జూన్ 23, మంగళవారం నాటికీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9553 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. మంగళవారం నాడు మొత్తం 3006 సాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన మరో ముగ్గురు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 220 కి పెరిగినట్టు తెలిపారు. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 219 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 4224 కి చేరింది. ప్రస్తుతం 5109 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(879):
- జీహెచ్‌ఎంసీ ఏరియా – 652
- మేడ్చల్ – 112
- రంగారెడ్డి – 64
- వరంగల్ రూరల్ – 14
- కామారెడ్డి – 10
- వరంగల్ అర్బన్ – 9
- జనగామ – 7
- నాగర్ కర్నూల్ – 4
- మంచిర్యాల – 2
- సంగారెడ్డి – 2
- మహబూబాబాద్ – 2
- మెదక్ – 1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu