పోలీస్ అకాడమీలో 180 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

180 Persons Test Positive At Telangana Police Academy, 180 Policemen Tested Positive, Hyderabad, National Police Academy in Hyderabad, Telangana Corona Cases, Telangana Corona Updates, Telangana Coronavirus, Telangana Police Academy

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గతకొన్ని రోజులుగా కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ అకాడమీ (టీఎస్‌పీఏ)లో180 మందికి కరోనా వైరస్‌ పాజిటివ్ గా తేలింది. 180 మందిలో 100 మంది ట్రైనింగ్ ఎస్సైలు, 80 మంది ఇతర సిబ్బంది ఉన్నారని డైరెక్టర్‌ వీకే సింగ్‌ చెప్పారు. అయితే వీరిలో సగం మందికి పైగా ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, వీరందరికి పోలీస్ అకాడమీలోనే ఐసోలేషన్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం అకాడమీలో శిక్షణా సిబ్బందితో కలిపి మొత్తం 2000 మందికి పైగానే ఉన్నట్టు తెలుస్తుంది. అకాడమీలో మిగతావారికి కూడా కరోనా వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశమునట్టు సమాచారం.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu