కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ జూలై 10, శుక్రవారం ఉదయం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు, విభజన చట్టంలో పథకాలకు నిధులు, జీఎస్టీ బకాయిలు, రాష్ట్రానికి రావాల్సిన ఇతర పెండింగ్ నిధులపై చర్చించారు. భేటీ అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడుతూ, కోవిడ్-19 కారణంగా నిధుల విడుదలలో కొంత ఆలస్యం ఉందని పేర్కొన్నారు.
అలాగే ఏప్రిల్, మే, జూన్ నెలలలో రాష్ట్రానికి 40 శాతం ఆదాయం తగ్గిందని చెప్పారు. మరోవైపు 3500 కోట్లు జీఎస్టీ బకాయిలు కూడా రాష్ట్రానికి రావాల్సి ఉందని, పెండింగ్ లో ఉన్న నిధులతో పాటుగా రాష్ట్రానికి అదనంగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు బుగ్గన తెలిపారు. అనంతరం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో మంత్రి బుగ్గన భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సహా మరి కొంతమంది కేంద్ర మంత్రులను బుగ్గన రాజేంద్రనాథ్ కలవనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu